భాజపా 'ఆపరేషన్ ఆకర్ష్'పై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు భాజపాలో చేరడంపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
"రాష్ట్రపతి నిన్న తన ప్రసంగంలో ప్రభుత్వం తరఫున దేశానికి హామీలు ఇస్తుంటే... అదే రోజు భాజపా ఆపరేషన్ ఆకర్ష్‌తో నలుగురు తెదేపా ఎంపీలను లాగేసుకుంది. అందులో ఇద్దరు ఎంపీలను భాజపా గతంలో 'ఆంధ్ర మాల్యా' అని విమర్శించింది. ఇప్పుడు వారినే పార్టీలోకి చేర్చుకొంది. ఇదంతా చూస్తుంటే ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది. భాజపా ఏం చేసినా అది న్యాయమే."
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఇదీ నేపథ్యం..
రాజ్యసభలో తెదేపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆరుగురిలో నలుగురు ఎంపీలు నిన్న భాజపా చెంతకు చేరారు. అంతేకాకుండా భాజపాలోకి తెదేపా రాజ్యసభా పక్షాన్ని విలీనం చేయాలని ఉపరాష్ట్రపతిని కోరారు.
- ఇదీ చూడండి: 'పెండింగ్ బిల్లుల రద్దుకు ఐదేళ్లు చాలు'