ETV Bharat / bharat

'వృక్ష సంరక్షణే' మానవుని అసలైన సంపద

పచ్చదనంతో అపురూపమైన అందాలను సృష్టించి, మానవ మనుగడకు ఆక్సిజన్​లా ఉపయోగపడుతున్న ప్రకృతికి విపత్తు వాటిల్లుతోంది. ప్రతి చెట్టు, పుట్టలను భగవంతుడిగా భావించి పూజించే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పచ్చదనం మాయమవుతోంది. కాలుష్య కోరల్లో చిక్కుకొని వాతావరణం విషపూరితమవుతోంది.

వృక్ష సంరక్షణలోనే దాగుంది.. మానవుని ఆసలైన సంపద
author img

By

Published : Nov 17, 2019, 8:20 AM IST

Updated : Nov 17, 2019, 12:25 PM IST

త్యాగ భావమునకు తరువులే గురువులు’ అన్నారు జంధ్యాల పాపయ్యశాస్త్రి. చెట్లకు మించిన సేవకులు, ఉపకారులు సృష్టిలో లేరు. వాటి గొప్పదనం గురించి వర్ణించని కవి లేరు. జీవజాలానికి ప్రాణవాయువు, ఫలాలు, ఔషధాలు అందించే చెట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు అవి లేనిదే- నది లేదు, నీరు లేదు, చివరికి నాగరికతా లేదనడం అతిశయోక్తి కాదు. ప్రకృతిలో భాగమైన చెట్టు, పుట్ట, నీరు, నదులను పూజించే గొప్ప సంప్రదాయం భారతీయులది. ఇదే సమయంలో ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా హరిత హననం జరుగుతున్నదీ మన దేశంలోనే కావడం ఆందోళన కలిగించే అంశం. తలసరి మొక్కల విషయంలో దేశం అట్టడుగు స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చీకటిలో చిరుదీపంలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు పచ్చదనానికి బీజం వేస్తున్నాయి. చిన్నారులు, యువకులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను భాగస్వాముల్ని చేస్తూ, మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా మలచిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ సంస్థ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

అంతరిస్తున్న అడవులు

భారత్‌లో వాతావణం వైవిధ్యభరితమైనది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన భూభాగం జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచింది. సువిశాల దేశంలో పండని పంటంటూ లేదు. పెరగని మొక్కంటూ లేదు. అయితే తలసరి ఒక్కో మనిషికి ఎన్ని మొక్కలు ఉన్నాయన్న లెక్కలు చూస్తే మాత్రం విస్తుపోక తప్పదు. ప్రపంచ తలసరి మొక్కల సగటు 422. మన దేశంలో మనిషికి 28 మాత్రమే ఉండటం ఆందోళనకర అంశం. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో మరీ ఘోరంగా తలసరి నాలుగు మొక్కలు మాత్రమే ఉన్నాయి. మొక్కల విషయంలో కెనడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ దేశంలో ప్రతి మనిషికి 8,953 మొక్కలు చొప్పున ఉన్నాయి. తరవాతి స్థానంలో రష్యా (4,461), ఆస్ట్రేలియా (3,266) నిలిచాయి. మొక్కల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసం ఉండటానికి కారణాలు అనేకం. అటవీ, పర్యావరణ విధానాలు, వారసత్వ అటవీ సంపద, ప్రభుత్వాలు పచ్చదనానికి ఇస్తున్న ప్రాధాన్యం, జన చైతన్యం, ప్రజా భాగస్వామ్యం ఇందుకు కారణాలుగా పేర్కొనవచ్చు. భారత్‌లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఏటా దేశంలో పచ్చదనం తరిగిపోతోంది. అడవులు కనుమరుగవుతున్నాయి.

అడవుల విస్తీర్ణం ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వేగంగా తగ్గిపోతోంది. అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనం ప్రకారం భూగోళంపై వెయ్యి కోట్ల ఎకరాల అడవులు ఉండగా, 1990 నుంచి సుమారు 12.9 కోట్ల హెక్టార్లు అన్యక్రాంతమయ్యాయి. వంట చెరకు, కలప స్మగ్లింగ్‌, చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఆక్రమణ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు తదితర కారణాలతో అరణ్యాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. సుమారు 90 కోట్ల ప్రజల నిత్య జీవనావసరాలకు అడవులే ఆధారం. భారత్‌లో వనాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. 1988 నాటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో మూడోవంతు భూభాగంలో అడవులు ఉండాలి. అయితే 24.39 శాతమే ఉంది. భారత అటవీ సర్వే సంస్థ (2017) నివేదిక ప్రకారం ఏటికేడు అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటుకంటే వెనకబడిపోయాయి. ఉభయ రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పలచబడుతోంది.

చెరువులు, తోటల నగరంగా పేరున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 60 శాతం హరిత విస్తీర్ణం కోసుకుపోయింది. ఏటా జనాభా వృద్ధి, పెరుగుతున్న స్థిరాస్తి క్రయ విక్రయాలు, పట్టణీకరణ కారణంగా వనాలు కనుమరుగవుతున్నాయి. నానాటికీ తరుగుతున్న అటవీ విస్తీర్ణం అనేక దుష్ఫలితాలకు దారితీస్తోంది. ఫలితంగా మానవాళి పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అడవులు తగ్గిపోతుండటం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవడం లేదు. భూతాపం పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల ప్రభావం అధికమై ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. కరవు కాటకాలు తీవ్రమై రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీటి కొరత నానాటికీ తీవ్రమవుతోంది. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ఎంతో మంది అల్లాడుతున్నారు. గోరుచుట్టుపై రోకటిపోటులా అడవుల్లో ఆహారం కరవై మూగజీవాలు జనారణ్యాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఇళ్లు, పంట పొలాలపై దాడిచేసి నష్టం కలిగిస్తున్నాయి. చెట్లే మనిషికి శ్వాస. ఆహారం, ఆరోగ్యం, ఆనందమయ జీవితాన్ని ఇచ్చేది వృక్షమాతలే. ఒక అభివృద్ధి చెందిన చెట్టు సంవత్సరానికి రూ. 24 లక్షల విలువ కలిగిన ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది. ఆరోగ్యవంతమైన వృక్షం ఏడాదికి 0.53 టన్నుల బొగ్గు పులుసు వాయువు, 1.95 కిలో గ్రాముల కాలుష్య కారకాలను శుద్ధి పరుస్తుంది. పెద్ద వయసు గల చెట్టు 1,400 గ్యాలన్ల నీటిని నిల్వ చేస్తుంది. రోజూ ఒక వ్యక్తి పీల్చే ప్రాణవాయువు పరిమాణం మూడు ఆక్సిజన్‌ సిలిండర్లతో సమానం. ఒక వ్యక్తి తన జీవిత కాలానికి కావాల్సిన ఆక్సిజన్‌ పొందాలంటే మూడు పెద్ద చెట్లు కావాలి. మనిషి జీవితంలో వృక్షాలు ఇంత కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రతి వ్యక్తి కనీసం ఒక్క మొక్క అయినా నాటుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం లభించదు.

EVERY BODY MUST PROTECT TREES IN THE WORLD
వృక్ష సంరక్షణలోనే దాగుంది.. మానవుని ఆసలైన సంపద

ప్రజల్లో మొక్కలు నాటే, వృక్షాలను కాపాడే అలవాటు పెంపొందించేందుకు ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రతి మనిషి తాను జీవించడానికి అవసరమైన ఆక్సిజన్‌ కోసం మూడు మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత అన్న సందేశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇప్పటివరకు 3.5 కోట్ల మొక్కలు నాటినట్లు అంచనా. బాలలు మొదలుకొని యువకులు, ఉపాధ్యాయులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, క్రీడా, రాజకీయ, వాణిజ్య రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. స్వచ్ఛందంగా, ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల ఇతరులూ స్ఫూర్తి పొందుతూ మొక్కలు నాటడానికి ముందుకు వస్తున్నారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలకు సంస్థ కార్యక్రమాలు విస్తరించాయి. ప్రభుత్వ నిధులు లేకుండా సాగుతున్న ఈ సామాజిక ఉద్యమం కారుచీకట్లో కాంతిరేకగా పేర్కొనవచ్చు.

అందరి బాధ్యత

స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారానికి వన సంరక్షణ చేపట్టాలి. హరితస్వప్న సాకారానికి ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఒక్క తాటిపైకి రావాలి. ఆకుపచ్చని, ఆనందమయ జీవన కోసం తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ కార్యక్రమం చేపట్టింది. ఏపీ సర్కారూ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వపరంగా ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు తగిన సహాయ, సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. యువత, ప్రజల్లో అవగాహన కల్పించి వారిని భాగస్వాములను చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి. కాలుష్యాన్ని నివారించాలి. దీర్ఘకాలంలో కలప, ఫలసాయాన్నిచ్చే మొక్కలను ఉచితంగా అందించాలి. ఎన్ని మొక్కలు నాటామన్న దానికంటే, వాటిలో ఎన్ని బతికాయన్న అంశానికి ప్రాధాన్యం ఇచ్చి ‘జియో టాగింగ్‌’ చేయడం అవసరం. స్థానిక ప్రజలు, అధికారులకు బాధ్యతలు అప్పగించి జీవించే మొక్కల శాతాన్ని పెంచాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా మొక్కలు నాటుతున్న హరిత సారథులు, సంస్థలను గుర్తించి సత్కరిస్తే వారు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పార్కులను సక్రమంగా నిర్వహించడంతోపాటు కొత్త పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. ప్రభుత్వ, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి. అతి తక్కువ పచ్చదనం గల ప్రాంతాలను గుర్తించి అక్కడ వన సంపద పెంచాలి. అప్పుడే పుడమి పచ్చని హారంగా మారుతుంది. ముందుతరాలు ‘పచ్చ’గా బతుకుతాయి.

ఒక్కడితో వెయ్యి ఎకరాల మాహారణ్యం సృష్టి

అసోమ్‌లోని జొర్హాట్‌ జిల్లాకు చెందిన ప్రకృతి పిపాసి, భారత అటవీ పుతుడ్రు జాదవ్‌ పయెంగ్‌ ఒంటరిగా మూడు దశాబ్దాలు కష్టపడి 1,300 ఎకరాల్లో మహారణ్యం సృష్టించారు. ఎడారి భూములను తన కృషితో సతత హరిత వనాలుగా మార్చారు. మొక్కల పెంపకం, చెట్ల సంరక్షణలో పయెంగ్‌ చేస్తున్న కృషి, సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈ ప్రాంత ప్రజలను కరవు, విపత్తుల నుంచి రక్షించారు. సంకల్పం ఉంటే సాధించలేనిది లేదంటూ నిరూపించారు. ఎందరో హరిత సైనికులకు ఆదర్శంగా నిలిచారు. ఏడు పదుల వయసులోనూ వృక్షో రక్షతి రక్షితః నినాదంతో మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షిస్తూ ముందుకు సాగుతున్న వనజీవి రామయ్య తెలుగువారికి స్ఫూర్తిదాయకం. తరువులకు మించిన గొప్ప సేవ మరొకటి లేదంటూ అయిదో తరగతి సాంఘిక శాస్త్రంలోని పాఠ్యాంశం నుంచి ఆయన ప్రేరణ పొందారు. నేటికీ మొక్కలు నాటే కృషిని కొనసాగిస్తుండటం విశేషం. ఇప్పటివరకు కోటి మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. చెట్లు లేకపోతే బతుకు, మెతుకు లేదంటూ హరితోపదేశం చేస్తున్నారు. ఎందరో మహానుభావులు వృక్షాల ఉనికి గుర్తించి హరిత సేవ చేస్తున్నారు. వారి బాటలో ముందుకు సాగడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. చెట్లు లేకపోతే ప్రకృతి సమతుల్యం ఉండదనే సత్యాన్ని గ్రహించి మొక్కలు నాటడానికి కదలాలి. దీనివల్ల కరవులు, అధిక ఉష్ణోగ్రతలు, భూతాపాలు, కాలుష్యాలు తగ్గిపోతాయి.

-ఎం. కరుణాకర్​రెడ్డి
(రచయిత- గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ రూపకర్త)

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 16 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2136: France Clashes AP Clients Only 4240288
Protesters attack cars and shops in Paris
AP-APTN-2114: Venezuela Guaido Speech AP Clients Only 4240287
Venezuela's Guaido calls for new protests
AP-APTN-2041: Venezuela Protest 3 AP Clients Only 4240284
Venezuelans take to streets for Maduro
AP-APTN-2035: Venezuela Protest 2 AP Clients Only 4240283
Crowds gather in Venezuela for rival protests
AP-APTN-2003: Bolivia Anez Guaido AP Clients Only 4240282
Bolivia's Áñez speaks to Venezuela's Guaidó
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 17, 2019, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.