బిహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 40 లక్షల మందికిపైగా వరదలకు ప్రభావితమయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ముమ్మరం చేసిందిం. నీటమునిగిన ప్రాంతాల నుంచి ఇప్పటివరకు సుమారు 7,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. సహాయక చర్యల కోసం 21 బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు.
భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాల నుంచి సుమారు 7,840ల మంది ప్రజలు, 265 పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు తెలిపింది ఎన్డీఆర్ఎఫ్. అంతేకాకుండా వారికి అవసరమైన మేర ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆ రాష్ట్రంలో వరద బీభత్సం కారణంగా.. ఇప్పటివరకు 11 మంది మరణించారు. మరో 40లక్షల మంది ప్రభావితమయ్యారు.
ఇదీ చదవండి: వరదలో పురిటి నొప్పులు- పడవలో కాన్పు