ETV Bharat / bharat

'ఫేస్​బుక్​ లైవ్​తో అధికారుల దృష్టికి జలవిలయం!' - uttarakhand flood news

ఉత్తరాఖండ్​ జలప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మన్వర్​ సింగ్​తో ఈటీవీ భారత్​ మాట్లాడింది. ఆ విధ్వంసం చూసి ఒళ్లు జలదరించిందని అతను తెలిపాడు. జలవిలయం దృశ్యాలను మొదటగా అతనే ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అనంతరం అవి వైరల్​గా మారాయి. అధికారులు అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆరోజు అసలు ఏం జరిగిందో స్వయంగా అతని మాటల్లోనే..

etv-bharat-special-talk-with-eyewitness-of-joshimath-disaster
ఆ విధ్వంసం చూసి ఒళ్లు జలదరించింది: ప్రత్యక్ష సాక్షి
author img

By

Published : Feb 9, 2021, 4:40 PM IST

ఫిబ్రవరి 7 ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్​లో పెనుప్రమాదం సంభవించింది. నందాదేవీ హిమానీనదం జలవిలయం సృష్టించింది. ధౌలిగంగా నది ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా జోషిమఠ్​లో వరదలు సంభవించాయి. రైని గ్రామం సహా తపోవన్​ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. ఆరోజు జరిగిన ఈ భయానక దృశ్యాలను ప్రత్యక్షంగా చూశాడు మన్వర్ సింగ్. ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసి ప్రజలు, అధికారులను అప్రమత్తం చేశాడు. అతనితో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది. అసలు ఆరోజు ఏం జరిగిందో స్వయంగా అతని మాటల్లోనే తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్ విధ్వంసం చూసిన ప్రత్యక్ష సాక్షితో ఈటీవీ భారత్​

" ఆరోజు ఆఫీస్​లో సమావేశంలో పాల్గొనేందుకు నేను వెళ్తున్నాను. ఉదయం 10.39 గంటలకు కొంత మంది అరుపులు వినిపించాయి. ఏదైనా బండరాయి జారిపడిందేమో అనుకున్నా. కానీ కొండలవైపు చూస్తే వరద ఉప్పొంగి ప్రవహిస్తుండటం గమనించా. ఆ ప్రవాహం చూసి వెంటనే జిల్లా విపత్తు అధికారికి ఫోన్ చేశా. ఆయన ఫోన్ కలవలేదు. వెంటనే ఆ విధ్వంస దృశ్యాలను ఫేస్​బుక్​ లైవ్​లో పోస్ట్ చేశా. వరదల కారణంగా ధౌలిగంగా నది ఉప్పొంగి ప్రవహించి తపోవన్​ ప్రాజెక్టు ధ్వంసమైన విషయాన్ని తెలియజేశా. ఈ ప్రమాదం గురించి శ్రీనగర్​, చమోలి, కర్ణప్రయాగ్​లోని నా మిత్రులకు సమాచారం అందించా. ఆయా ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పా. అనంతరం రైని గ్రామానికి చేరుకున్నా. అక్కడి విధ్వంసం చూసి ఒళ్లు జలదరించింది. రిషిగంగ ప్రాజెక్టు, నీతి బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమయ్యాయి."

-మన్వర్ సింగ్, రైని గ్రామస్థుడు

భయానక దృశ్యాలను చూస్తూనే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు మన్వర్. ఆయన తీసిన వీడియోలే వైరల్​ అయ్యి అధికారుల దృష్టికి వెళ్లాయి.

తన కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరి ప్రాణాలు కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు మన్వర్. మెరుపు వరదల కారణంగా క్షణాల్లోనే పదుల సంఖ్యలో జనం చనిపోయారని చెప్పాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య జరగ్గా.. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపాడు.

ఇదీ చూడండి: 'హైదరాబాద్​' పరికరంతో ఆపరేషన్​ ఉత్తరాఖండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.