ETV Bharat / bharat

ఈ 'గ్రీన్​మ్యాన్'కు ప్రకృతి అంటే ఎంత ప్రేమో! - india green man

కాలుష్యం పెరుగుతోందని అందరం ఆందోళన చెందుతాం. మొక్కలు నాటుదాం అంటే మాత్రం.. తీరిక లేదని చెబుతాం. కానీ, లూధియానాకు చెందిన 'గ్రీన్​మ్యాన్'​ రోహిత్‌ మెహ్రా అందరిలా కాదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 లక్షలు మొక్కలు నాటాడు. పంజాబ్‌లోని అన్నిజిల్లాల్లో హరితప్రాంతాలు సృష్టంచాడు. సూరత్‌, బరోడా, ముంబయి, దిల్లీల్లో చిట్టడవులు అభివృద్ధి చేశాడు. రోహిత్‌ 'గ్రీన్‌మిషన్‌' లక్ష్యాలు, అందులో ఆయన ఎలా విజయం సాధించాడో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే!

etv bharat special story about green man rohith mehra who planted 8 lakh plants
ఈ 'గ్రీన్​మ్యాన్'కు ప్రకృతి అంటే ఎంత ప్రేమో!
author img

By

Published : Oct 30, 2020, 8:58 AM IST

ఈ 'గ్రీన్​మ్యాన్'కు ప్రకృతి అంటే ఎంత ప్రేమో!

'గ్రీన్‌మ్యాన్‌'గా సుపరిచితుడైన రోహిత్‌ మెహ్రా దేశవ్యాప్తంగా 75 హరితప్రాంతాలు అభివృద్ధి చేశాడు. తను తీర్చిదిద్దే ప్రతివనంలో 600 నుంచి 700 వరకు చెట్లు ఉంటాయి. అలా దేశం నలుమూలలా ఇప్పటి వరకు 8లక్షల మొక్కలు నాటాడు.

లూధియానాలో పన్నుల విభాగం సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న రోహిత్ మెహ్రా... వృత్తిపరంగా ఎంత ఒత్తిడిలో ఉన్నా పర్యావరణంపై మక్కువ వదులుకోలేదు. నాలుగేళ్లుగా వ్యక్తిగతంగానే మొక్కలు నాటుతున్నాడాయన. పంజాబ్‌లోని అన్నిజిల్లాల్లో హరితప్రాంతాలు, సూరత్‌, బరోడా, ముంబయి, దిల్లీల్లో చిట్టడవులు అభివృద్ధి చేశాడు.

గ్రీన్​బెల్ట్​లతో..

అయిదు రకాల చెట్లతో గ్రీన్‌బెల్ట్‌లను అభివృద్ధి చేస్తున్నాడు రోహిత్​ మెహ్రా. ఉత్తరాది నుంచి బిల్వ, దక్షిణాది నుంచి రాచ ఉసిరి, ఆగ్నేయం నుంచి అశోక, తూర్పు నుంచి మర్రి, పశ్చిమం నుంచి తెచ్చి రాగి చెట్లను పెంచుతున్నాడు.

"వేర్వేరు జాతుల మొక్కలు కలిపి కొన్ని విభిన్న గ్రీన్‌బెల్ట్‌లు కూడా అభివృద్ధి చేశాను. వాటిల్లో ఒకటైన త్రివేణి వనంలో వేప, రాగిచెట్లు చూడొచ్చు . అలానే "నానక్‌ వనం". వాటితో పాటు 9నక్షత్రాల ఆకారంలో మొక్కలు నాటి నక్షత్రవనాన్ని తీర్చిదిద్దాం. ఇవన్నీ దేశ ప్రాచీన, మనవైన, చారిత్రక పవిత్ర వృక్షాలు. బయట నుంచి తీసుకుని వచ్చిన వృక్షజాతులు అందగా కనిపిస్తాయి. కానీ అవి ఇక్కడ అభివృద్ధి చెందేవి కాదు."

--రోహిత్‌ మెహ్రా, పర్యావరణ ప్రేమికుడు.

వేగంగా పెరుగుతాయ్..

తాను నాటే మొక్కలు 7 నెలల వ్యవధిలో 10అడుగల వరకు ఎత్తు పెరుగుతాయని చెబుతున్నాడు రోహిత్‌ మెహ్రా. 3, 4 నెలల్లోనే 80 నుంచి 90 ఎత్తుకు చేరతాయని అంటున్నాడు. నాటేటప్పుడు 2 మొక్కల మధ్య రెండున్నర అడుగుల దూరం పాటిస్తానన్నాడు.

"ఈ చెట్లు ఉమ్మడి కుటుంబం లాంటివి. ఒకదాని అవసరాలు మరొకటి తీరుస్తుంటాయి. గ్రీన్‌బెల్ట్‌ల అభివృద్ధిలో మిగిలిన వాటికంటే 10రెట్లు వేగంగా పెరిగే వివిధరకాల వృక్షజాతులు ఉన్నాయి. మొదట్లో బుద్ధనాలా పరిసరాల్లో 300 మొక్కలు నాటాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు 700 నుంచి 1000 మొక్కల నాటనున్నాం. ఈ చెట్లు చాలావేగంగా పెరగడంతో పాటు గాలిని కూడా శుద్ధి చేస్తాయి."

--రోహిత్‌ మెహ్రా, పర్యావరణ ప్రేమికుడు.

విధులు నిర్వర్తిస్తూనే..

ప్రభుత్వ అధికారిగా కీలక విధులు, ఊపిరి సలపని పనిలో ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణకు సమయం కేటాయిస్తునే ఉంటాడు రోహిత్‌. పగలు, రాత్రి కూడా కృషి చేస్తుంటాడు.

"మన మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉంది. మొక్కలు లేని జీవితాన్ని ఊహించలేం. పరిశోధనశాలల్లో తయారు చేసిన ఆక్సిజన్‌ను గంట సేపు తీసుకోవాలంటే వేలల్లో ఖర్చు పెట్టాలి. ప్రకృతిలో అది ఉచితంగానే లభిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోలేక పోతే భవిష్యత్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనన్ని మొక్కలు నాటమనే అందరికీ నా విజ్ఞప్తి."

--రోహిత్‌ మెహ్రా, పర్యావరణ ప్రేమికుడు

హరితభారతం కోసం 1000 గ్రీన్‌బెల్ట్‌లు అభివృద్ధి చేయాలన్నది రోహిత్‌ సంకల్పం. తన ఈ పర్యావరణహిత కార్యక్రమాల ద్వారా రోహిత్‌ పంజాబ్‌వ్యాప్తంగా సుపరిచితం. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండీ.. ప్రకృతిపట్ల రోహిత్‌ చూపుతున్న ప్రేమకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:మతమేదైతేనేం? మనమంతా మనుషులమే కదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.