ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై కశ్మీర్​ పోలీసుల దాడి - సందీప్ చౌదరి

జమ్ము కశ్మీర్​లో ఎన్నికల నిర్వహణపై రిపోర్టింగ్​ చేస్తోన్న ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేసుకున్నారు. వీరిలో ఈటీవీ భారత్​ రిపోర్టర్​ కూడా ఉన్నారు.

ETV Bharat reporter, 2 other journalists  beaten by police in South Kashmir
ఈటీవీ భారత్​ రిపోర్టర్లపై కశ్మీర్​ పోలీసుల దాడి
author img

By

Published : Dec 10, 2020, 1:05 PM IST

Updated : Dec 10, 2020, 1:44 PM IST

దక్షిణ కశ్మీర్​లోని అనంత్​నాగ్​ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఆ ప్రాంతంలో జరుగుతోన్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల ఐదో దశ పోలింగ్​పై రిపోర్టింగ్ చేస్తుండగా ఈ చర్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో తనతోపాటు నెట్​వర్క్​ 18 రిపోర్టర్ ముదాసిర్ ఖాద్రీ​, పంజాబ్ కేసరి రోపోర్టర్ జునైద్ రఫీఖ్ గాయపడ్డారని ఈటీవీ భారత్ జర్నలిస్టు ఫయాజ్ అహ్మద్​ లోలు తెలిపారు.

"తనను ఓటు వేసేందుకు అనుమతించడంలేదని ఆరోపించిన 'పీపుల్ అలయన్స్​ ఫర్ గుప్కార్ డిక్లరేషన్' స్థానిక అభ్యర్థి బైట్​ తీసుకున్నాం. తర్వాత దీనిపై పోలీసుల స్పందన తెలుసుకోవడానికి వెళ్లాం. కానీ, వాళ్లు తిరిగి మాపై దాడి చేశారు. మాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారు. ఈ ఘటనలో జునైద్​ స్పృహ తప్పి పడిపోయాడు".

-ఫయాజ్ అహ్మద్ లోలు, ఈటీవీ భారత్ రిపోర్టర్

ఈ ఘటన అనంతరం ఈటీవీ భారత్​ పలుమార్లు ఫోన్​ చేసినా... అనంత్​నాగ్ ఉన్నత పోలీసు అధికారి సందీప్ చౌదరి, జిల్లా కమిషనర్ కెకె సిద్దా స్పందించలేదు. కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్... ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని తగిన చర్య తీసుకుంటామని తెలిపారు.

పోలీసుల చర్యపై కశ్మీర్​ ప్రెస్ క్లబ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై త్వరతగతిన దర్యాప్తు చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి:కశ్మీర్​ 'స్థానిక' పోరు- పోలింగ్​ కేంద్రాల్లో భారీ క్యూ

Last Updated : Dec 10, 2020, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.