జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి 16 దేశాల ప్రతినిధుల బృందం నేడు శ్రీనగర్‌కు చేరుకుంది. సుమారు ఏడు గంటలపాటు శ్రీనగర్‌లో పర్యటించిన నేతలు, ప్రజాసంఘాలు, సైన్యాధికారులతో భేటీ అయ్యారు.
పర్యటనలో భాగంగా కశ్మీర్‌లోని పౌర సమాజ సభ్యులతో సమావేశమయ్యారు ప్రతినిధులు. పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజం, గుజ్జుర్లు, న్యాయవాదులను కలిశారు. కశ్మీర్‌లోని రాజకీయ నేతలు, సైన్యం ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు.
అనుమతి నిరాకరణ
లోయలో పర్యటించేందుకు అధికారులు అనుమతివ్వలేదు. స్థానిక పరిస్థితులపై విదేశీ బృందానికి సీఎస్ బీవీఆర్ సుబ్రమణ్యన్, డీజీపీ దిల్బాగ్ సింగ్ వివరించారు. అధికరణ 370 రద్దు అనంతరం భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను తెలిపారు. వైద్య సదుపాయాలకు సంబంధించి ఆరోగ్యం, ఆర్థిక శాఖ కమిషనర్ అతుల్ దుల్లో వివరించారు.
ఇది రెండోసారి..
గతేడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత నుంచి అక్కడ విదేశీ ప్రతినిధులు పర్యటించటం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు సందర్శించి లోయలో పరిస్థితులను తెలుసుకున్నారు.