ETV Bharat / bharat

'భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది' - ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై వెంకయ్యనాయుడు

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అయన మాట్లాడారు.

Vice President Venkaiah Naidu on World Environment Day
భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
author img

By

Published : Jun 5, 2020, 1:05 PM IST

భూగోళంపై తలెత్తే సమస్యలను పరిష్కరించుకొనే దిశగా ప్రకృతిని తీర్చిదిద్దుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన వెంకయ్య.. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటోదన్నారు. అలాగే జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి మానవ ప్రయత్నాలను పెంచాల్సి మరింత అవసరం ఉందని అన్నారు.

పర్యావరణ పరిరక్షణ పోరులో భాగంగా వాతావరణమే కాకుండా.. ఆహార భద్రత, నీటి సరఫరాలో మెరుగవ్వాలని సూచించారు వెంకయ్య.

'పోరాటం నేటి నుంచే ఆరంభం కావాలి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' అని ఉపరాష్ట్రపతి సచివాలయం ట్విట్టర్​లో పేర్కొంది.

ఇదీ చదవండి: 'భవిష్యత్​ తరాలకు కాలుష్య రహిత భూమినిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.