జమ్ముకశ్మీర్ కుల్గాంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇప్పటికి ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కుల్గాంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఇంతలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబెట్టారు. భద్రతా దళాలు దీటుగా స్పందిస్తున్నాయి.
భారీగా ఆయుధాలు స్వాధీనం
అంతకుముందు రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల పక్కా సమాచారంతో ... 38 రాష్ట్రీయ రైఫిల్స్ (మద్రాసు), జమ్ము కశ్మీర్ పోలీసు సిబ్బంది కలిసి గాలింపు చేపట్టారు.
ఉగ్రస్థావరాన్ని కనిపెట్టి భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బారెల్ గ్రనేడ్ లాంచర్, యూబీజీఎల్ గ్రనేడ్లు, ఏకే మ్యాగ్జిన్లు, పిస్టల్స్, ఐడ్ మేకింగ్ మెటీరియల్తో డిటోనేటర్లు, ప్రెజర్ మైన్ సహా ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి వీటిలో ఉన్నాయి.
ఇదీ చూడండి: 'అమెరికాతో అణు చర్చలు జరిపే ఆలోచనే లేదు'