మెదడువాపు వ్యాధితో చిన్నారులు మరణిస్తుండడంపై కేంద్రం సహా బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో 100 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. అనేక మంది చికిత్స పొందుతున్నారు. పిల్లల మరణాలతో ఆవేదన చెందిన మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నేడు విచారించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పోషకాహార పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏడు రోజుల గడువు విధించింది.
విచారణ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ముజఫర్‌పుర్ తరహా మరణాలు సంభవిస్తున్నాయని న్యాయవాదులు చెప్పారు. దీంతో ఆ రాష్ట్ర సర్కారుకీ నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయం 10రోజుల తర్వాత మళ్లీ విచారించనున్నట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : గుడిలోకి మొసలి... గ్రామస్థుల పూజలు