ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో రోడ్డు ప్రమాదం, 11మంది మృతి - 5 lakhs

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. స్పందించిన గవర్నర్​ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.

జమ్ముకశ్మీర్​లో రోడ్డు ప్రమాదం, 11మంది మృతి
author img

By

Published : Jun 27, 2019, 6:33 PM IST

Updated : Jun 27, 2019, 7:58 PM IST

జమ్ముకశ్మీర్​లో రోడ్డు ప్రమాదం, 11మంది మృతి

జమ్ముకశ్మీర్​లో షోపియాన్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలోపడి 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పూంచ్​లోని ఓ విద్యాసంస్థ నుంచి షోపియాన్​కు బయలుదేరిన మినీ బస్సు పీర్​కి గలీ వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది బాలికలు, ఇద్దరు బాలురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు విద్యార్థులను షోపియాన్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

రూ.5 లక్షల పరిహారం..

ఈ విషాద ఘటనపై జమ్ముకశ్మీర్ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: జులై 25 వరకు రిమాండ్​లోనే నీరవ్​మోదీ

Intro:Body:

pp

Conclusion:
Last Updated : Jun 27, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.