ఓ గజరాజుకు అడవిలో తినేందుకు ఏమీ దొరకలేదేమో ఆకలితో అలమటిస్తూ జనావాసాల్లోకి చేరింది. కనిపించిన రెస్టారెంట్లోకి చొరబడి... ఆహారం కోసం వెతికింది. కానీ అందుబాటులో ఏమీ కనిపించలేదు. నిరాశగా వెనుదిరిగింది ఆ ఏనుగు. కోయంబత్తూర్లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఏనుగు వచ్చిన సమయంలో తమ ఉద్యోగులు బిజీగా ఉన్నారని రెస్టారెంట్ వర్గాలు చెప్పాయి.
కోయంబత్తూర్, అనకట్టి, మంకరాయి ప్రాంతాల్లో 50 అడవి ఏనుగులు ఈ విధంగా సంచరిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఆహారం కోసం ఏనుగులు జనావాసాల్లోకి రావడం నిత్యకృత్యమైపోయిందని వాపోయారు.
ఇదీ చూడండి: బేటీ బచావోపై లోగోతో విద్యార్థుల రికార్డు