సార్వత్రిక సమరం అంటే దేశమంతా సందడే. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏం చేస్తారు? అని నెలలపాటు చర్చ. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలూ తోడైతే? రాజకీయ చర్చలకు అవధులు ఉండవు. దేశంలోని 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం అదే పరిస్థితి.
2014లో 5 రాష్ట్రాల శాసనసభలకు లోక్‌సభతోపాటే ఎన్నికలు జరిగాయి. అప్పుడు దాదాపు అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలదే హవా. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లగా... ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం పోలింగ్. ఈసారి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.
ఒడిశా....
ఒడిశాలో బలమైన నేత నవీన్ పట్నాయక్. ఈయన సారథ్యంలోని బిజూ జనతా దళ్ పార్టీ 19 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఒడిశాపై భాజపా భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండనుంది.
ఒడిశాలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: పట్నాయక్ లక్ష్యం 'పాంచ్ పటాకా'
అరుణాచల్‌ప్రదేశ్...
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్ మధ్యే. 1978లో జనతా పార్టీ గెలవడం మినహా.. ఇప్పటివరకు 8 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం. 2014లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2016లో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో పరిస్థితి తారుమారైంది. అధికారం భాజపా వశమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. ఒకప్పటి వైభవాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది హస్తం పార్టీ. అధికారం నిలబెట్టుకునేందుకు అంతే దీటుగా పనిచేసింది కమలదళం.
అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి దశలోనే అన్ని స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది.

ఇదీ చూడండి: భారత్ భేరి: అరుణాచల్ పీఠం ఎవరిది?
సిక్కిం...
శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సిక్కిం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ 1994 నుంచి పవన్ చామ్లింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ(ఎస్డీఎఫ్)కి సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం)కు మధ్య పోటీ ఉండనుంది.
జాతీయ పార్టీలను సిక్కిం ప్రజలు ఎప్పుడూ ఆదరించలేదు. ఈసారైనా వారి హృదయాలు గెలుచుకునే లక్ష్యంతో పనిచేశాయి భాజపా, కాంగ్రెస్.
ఫుట్‌బాల్ ఆటగాడు భైచుంగ్ భుటియా హమ్రో సిక్కిం పార్టీ స్థాపించి, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
సిక్కింలో తొలి విడతలోనే అన్ని స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది.

ఈ రాష్ట్రాల్లో అధికార పీఠం ఎవరిదో మే 23న తేలనుంది.
ఇదీ చూడండి: భారత్ భేరి: రికార్డుల కింగ్ సిక్స్ కొడతారా