తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఈసీ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తోంది.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఎన్నికల సంఘం ఓటింగ్ సాగుతోంది. ఇటీవల మావోలు దాడి చేసిన ఛత్తీస్‌గఢ్ దంతెవాడ ప్రాంతంలోనూ ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
-
Chhattisgarh: Villagers in Dantewada turnout in large numbers to cast their votes for #LokSabhaElections2019 . On 9th April, BJP MLA Bheema Mandvi and four PSOs lost their lives in a naxal attack in Dantewada. pic.twitter.com/umDXQJhtne
— ANI (@ANI) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chhattisgarh: Villagers in Dantewada turnout in large numbers to cast their votes for #LokSabhaElections2019 . On 9th April, BJP MLA Bheema Mandvi and four PSOs lost their lives in a naxal attack in Dantewada. pic.twitter.com/umDXQJhtne
— ANI (@ANI) April 11, 2019Chhattisgarh: Villagers in Dantewada turnout in large numbers to cast their votes for #LokSabhaElections2019 . On 9th April, BJP MLA Bheema Mandvi and four PSOs lost their lives in a naxal attack in Dantewada. pic.twitter.com/umDXQJhtne
— ANI (@ANI) April 11, 2019
బిహార్‌లో రాష్ట్రమంత్రి ప్రేమ్ కుమార్ పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు.
వివిధ రాష్ట్రాల్లో 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ ఈ విధంగా ఉంది. నాగాలాండ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 21 శాతం ఓటింగ్ నమోదైంది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
నాగాలాండ్ | 21 |
పశ్చిమ్‌బంగ | 18.12 |
మిజోరం | 17.5 |
మణిపుర్ | 15.6 |
అరుణాచల్‌ప్రదేశ్ | 13.3 |
తెలంగాణ | 10.6 |
ఛత్తీస్‌గఢ్ | 10.2 |
అసోం | 10.2 |
లక్షద్వీప్ | 9.83 |
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ | 5.83 |
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 220వ పోలింగ్ బూత్‌లో ఓటు వినియోగించుకున్నారు.
-
Maharashtra: Union Minister Nitin Gadkari cast his vote at polling booth number 220 in Nagpur parliamentary constituency #LokSabhaElections2019 pic.twitter.com/hSrlIySwUV
— ANI (@ANI) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maharashtra: Union Minister Nitin Gadkari cast his vote at polling booth number 220 in Nagpur parliamentary constituency #LokSabhaElections2019 pic.twitter.com/hSrlIySwUV
— ANI (@ANI) April 11, 2019Maharashtra: Union Minister Nitin Gadkari cast his vote at polling booth number 220 in Nagpur parliamentary constituency #LokSabhaElections2019 pic.twitter.com/hSrlIySwUV
— ANI (@ANI) April 11, 2019
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్‌పుర్), కిరణ్ రిజిజు(అరుణాచల్ పశ్చిమం), వీకే సింగ్( ఘజియాబాద్), మహేశ్ శర్మ(గౌతమ్ బుద్ధ్ నగర్), హన్స్‌రాజ్ అహిర్(చంద్రాపుర్), సత్యపాల్ సింగ్(బాగ్పత్) లు తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లోనే భవితవ్యం తేల్చుకోనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలు 543 నియోజకవర్గాలకు 7 దశల్లో జరగనున్నాయి. తొలి దశలో 91 స్థానాలకు ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మే 23న ఫలితాలు ప్రకటించనున్నారు.