ETV Bharat / bharat

బిహార్‌ బరి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం(ఈసీ). రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది.

Election commission ready to prepare for Bihar assembly election counting
బిహార్‌ బరి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం- రేపే ఫలితాలు
author img

By

Published : Nov 9, 2020, 6:28 AM IST

బిహార్‌లో ఈనెల 10న (మంగళవారం) నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు చంపారన్‌, గయ, శివాన్‌, బేగుసరయి జిల్లాల్లో 4 చొప్పున లెక్కింపు కేంద్రాలు సిద్ధమయ్యాయి. మిగతా జిల్లాల్లో అవసరాన్ని బట్టి 1 లేదా 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిహార్‌లో అక్టోబరు 28, ఈనెల 3, 7 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఈమేరకు ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను (కేంద్ర సాయుధ పోలీసు దళం-సీఏపీఎఫ్‌, బిహార్‌ మిలటరీ పోలీస్‌, జిల్లా పోలీసులతో) ఏర్పాటు చేసినట్లు బిహార్‌ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్‌.ఆర్‌.శ్రీనివాస తెలిపారు.

  • ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరుస్తారు.
  • ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ప్రదర్శన తెరలను, 2 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పాత్రికేయులు, భద్రత సిబ్బంది కోసం కేటాయిస్తారు.
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు సిద్ధం కాగా.. ఒక్కో హాల్‌కు 7 టేబుళ్లు ఉంటాయి.

ఫలితాలెలా ఉన్నా.. హుందాగా ఉండండి!

ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ సంయమనం పాటించాలని.. హుందాగా వ్యవహరించాలని రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా కాల్చడం, ఉత్సాహంతో కాల్పులు జరపడం, ప్రత్యర్థులపై దూకుడు, దుందుడుకుగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఇలాంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని స్పష్టం చేసింది. బిహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమికే విజయావకాశాలున్నట్లు చాలామేర ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

ఇదీ చూడండి: లైవ్​: ఎగ్జిట్​ పోల్స్​ తీర్పు- మహాకూటమిదే బిహార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.