సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో దేశంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా.
మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈసీ.
నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు:
ఆంధ్రప్రదేశ్, సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించనున్నారు. ఏప్రిల్-మే మధ్య కాలంలో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితి ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్: స్థానాలు:
శాసనసభ : 175, లోక్సభ-25
సిక్కిం: స్థానాలు:
శాసనసభ : 32, లోక్సభ-1
ఒడిశా: స్థానాలు:
శాసనసభ : 147, లోక్సభ-21
అరుణాచల్ ప్రదేశ్: స్థానాలు
శాసనసభ : 60, లోక్సభ-2
జమ్ముకి ఎందుకు లేవు..?
కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాసనసభకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తెలిపింది. భద్రతా బలగాలు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ అరోరా తెలిపారు. ముందుగా లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంత్ నాగ్ లోక్సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.