ETV Bharat / bharat

చైనాలో చిక్కుకున్న భారత నావికులకు విముక్తి! - ఎంవీ అనస్తాసియా

చైనాలో చిక్కుకున్న ఎంవీ అనస్తాసియా నౌక బృందం ఈనెల 14న భారత్​కు చేరనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ బుధవారం వెల్లడించారు.

Eighteen Indian sailors stuck in China to return to India on Feb 14: Mandaviya
ఈనెల 14న భారత్​కు చేరనున్న ఎంవీ అనస్తాసియా నౌక బృందం
author img

By

Published : Feb 10, 2021, 1:19 PM IST

చైనాలో చిక్కుకున్న 18 మంది భారత నావికులు ఈనెల 14న భారత్​కు చేరనున్నారని నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ బుధవారం ప్రకటించారు. జపాన్​ నుంచి బృందం బుధవారం బయలుదేరనుందని తెలిపారు. త్వరలోనే వారు వారి కుటుంబీకులను కలుస్తారని అన్నారు.

ఎంవీ అనస్తాసియా నౌక బృందం తిరుగు ప్రయాణానికి కృషి చేసిన భారత దౌత్య కార్యాలయం, మెడిటెరేనియన్​ షిప్​ సంస్థలను మంత్రి ప్రశంసించారు.

గతేడాది సెప్టెంబరు నుంచి 18 మంది నావికులు చైనా తీరంలో చిక్కుకున్నారు. ఇదివరకు ఇదే విధంగా చిక్కుకున్న 23 మంది సభ్యలు గల ఎంవీ జగ్​ ఆనంద్​ నౌక బృందాన్ని.. ఈ ఏడాది జనవరి 14న భారత్​కు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి : 'భారత్- చైనా ఉద్రిక్తతలను గమనిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.