ETV Bharat / bharat

పాకలో అగ్ని ప్రమాదం- 18 పశువులు మృత్యువాత

గుజరాత్​లో దారుణం జరిగింది. అగ్ని ప్రమాదానికి ఓ పశువుల పాకలోని 18 జంతువులు చనిపోయినట్లు యజమాని తెలిపారు.

Eighteen animals killed in massive stable fire in Bharuch
పాకలో అగ్ని ప్రమాదం- 18పశువులు మృతి
author img

By

Published : Jan 11, 2021, 11:32 AM IST

గుజరాత్​ బారుచ్​ జిల్లాలోని కంబోడియా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 పశువులు మరణించాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 9 ఆవులు, 8 లేగ దూడలు చనిపోయినట్లు యజమాని రామ్​ రాపోలియా తెలిపారు. మొదట మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నంచినప్పటికీ చుట్టూ వ్యాపించాయన్నారు. ఈ క్రమంలో పాకలో ఉన్న 28 పశువుల్లో 18 అక్కడికక్కడే విగతజీవులగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుటుంబ పోషణకు దన్నుగా ఉన్న పశుసంపదను కోల్పోయానని రామ్​ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 12 లక్షలు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో గాయపడిన జంతువులకు స్థానికంగా ఉండే పశుసంవర్థక శాఖ అధికారులు చికిత్స చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అగ్ని ప్రమాదంతోనే పశువులు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: నదిలో బంగారు నాణేలు- తండోపతండాలుగా జనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.