ETV Bharat / bharat

బ్రిటన్ నుంచి వచ్చినవారి కోసం గాలింపు

బ్రిటన్​, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు గోవా వైద్యాధికారులు. కొత్త రకం కరోనా విస్తరిస్తోన్ననేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ గోవాలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.

Efforts on to locate 602 people who came to Goa from UK and UAE
బ్రిటన్ నుంచి వచ్చినవారి కోసం గాలింపు
author img

By

Published : Dec 24, 2020, 1:13 PM IST

కొత్త కరోనా వైరస్​ బ్రిటన్​ను వణికిస్తోన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చిన వారికోసం గాలిస్తున్నట్లు గోవా వైద్యాధికారులు పేర్కొన్నారు. డిసెంబర్​ 9 నుంచి దాదాపు 602 మంది బ్రిటన్​, అరబ్​ దేశాల నుంచి తమ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు.

ఈ రెండు దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది దక్షిణ గోవా జిల్లాలో ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 91 మంది కన్​సాలియమ్​లో, 57 మంది కోర్టాలియమ్​లో ఉన్నట్లు గుర్తించారు. మరో 48 మంది ఉత్తర గోవాలో, 47 మంది చింబెల్​లో ఉన్నట్లు తెలిపారు. గోవా రాజధాని పనాజీలో ఉన్న 28 మంది కోసం గాలింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

దక్షిణ గోవాలోని లౌటోలిమ్ కర్టోరిమ్, నవేలిమ్, క్యూపెమ్, వాస్కో, చించినిమ్, బల్లి, కనాకొన, కుర్చోరెమ్, సంగుయెమ్ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సూచించారు వైద్యాధికారులు. ఉత్తర గోవాలోని... అల్డోనా, మపూస, సియోలిమ్, పోర్వోరిమ్, షిరోడ, దర్బాండొర, పొండ, కన్సర్వానెమ్, కోల్వలే ప్రాంతాల్లోని అధికారులనూ అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి:ఆగని అన్నదాత ఆందోళన- చట్టాల రద్దే ధ్యేయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.