మెట్రిక్యులేషన్(పదో తరగతి), ఇంటర్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు కార్లను బహుమతిగా ఇచ్చారు ఝార్ఖండ్ విద్యాశాఖమంత్రి జగర్నాథ్ మహతో. పరీక్షలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకే మనీశ్ కుమార్ కటియార్, అమిత్ కుమార్‌కు కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు మంత్రి. వచ్చే సంవత్సరం టాపర్లకు.. వారి మొత్తం చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు, ప్రముఖ రాజకీయ నేత వినోద్ బిహారీ మహతో జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్లు అందజేశారు. మంత్రి గిఫ్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.
విద్యార్థులను ఇలా ప్రోత్సహిస్తే.. మిగతావారిలోనూ పోరాటపటిమ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మహతో.
మనీశ్ కుమార్.. మెట్రిక్యులేషన్లో 98 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానం పొందాడు. అమిత్.. ఇంటర్(సైన్స్ ఆర్ట్స్ అండ్ కామర్స్)లో 91.4 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.