13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..
ఎరువుల కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఇందులో భాగంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి కంపెనీలోనూ తనిఖీలు నిర్వహిస్తోంది.
జోధ్‌పుర్‌లోని అగ్రసేన్ గహ్లోత్‌కు చెందిన అనుపమ్ కృషి పేరుతో ఉన్న కంపెనీ సహా రాజస్థాన్, బంగాల్, గుజరాత్, దిల్లీలోని మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కుంభకోణంలో రూ.7 కోట్ల కస్టమ్స్ జరిమానా ఎదుర్కొంటున్నారు అగ్రసేన్ గహ్లోత్. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఛార్జ్‌షీట్ కూడా నమోదు చేసింది ఈడీ.
రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈడీ దాడులు చర్చనీయాంశంగా మారాయి.