ETV Bharat / bharat

ఆర్థిక వృద్ధి అంచనాలను అందుకునేనా? - ఆర్థిక సర్వే

2018-19లో వృద్ధిరేటు ఏడున్నర శాతం వరకు ఉండగలదని రెండేళ్లక్రితం ఆర్థిక సర్వే ఊహించగా, వాస్తవంలో అది 6.8 శాతానికి పరిమితమైంది. దేశ వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదంటూ ఆరు నెలలక్రితం పలికిన జోస్యమూ వట్టిపోయి ఇటీవల 4.8 శాతం మేర నమోదైన అంచనాలు దిమ్మెరపరచాయి. 2024-25నాటికి భారత్‌ అధమపక్షం 1.4 లక్షలకోట్ల డాలర్లు (రూ.100లక్షల కోట్లు) వ్యయీకరించాల్సి ఉంటుందన్న ఆర్థిక సర్వే, పెట్టుబడుల ఉపసంహరణకు గట్టిగా ఓటేసింది.ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు అవసరమనడం- బడ్జెట్‌ సరళికి ముందస్తు సూచికగా ద్యోతకమవుతోంది. ప్రస్తుత ద్రవ్య నియంత్రణ విధానం ప్రకారం ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మూడు శాతానికి కట్టడి చేయాలన్నది తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం. కేంద్రం మొగ్గును ఆర్థిక సర్వే ప్రతిఫలిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రాలూ తమ సంగతేమిటని గళమెత్తితే- ద్రవ్య నియంత్రణ నిబంధనావళి ఏం కావాలి?

economic-survey
వృద్ధి అంచనాల మోత
author img

By

Published : Feb 1, 2020, 7:53 AM IST

Updated : Feb 28, 2020, 5:59 PM IST

పదకొండేళ్ల కనిష్ఠస్థాయికి పతనమై ఆందోళనపరుస్తున్న భారత వృద్ధిరేటు ఇకమీదట ‘అనుకూల వాతావరణంలో’ పుంజుకొని ఆరున్నర శాతందాకా ప్రగతిని నమోదు చేయగలదని తాజా ఆర్థికసర్వే నమ్మకంగా చెబుతోంది. 2018-19లో వృద్ధిరేటు ఏడున్నర శాతం వరకు ఉండగలదని రెండేళ్లక్రితం ఆర్థిక సర్వే ఊహించగా, వాస్తవంలో అది 6.8 శాతానికి పరిమితమైంది. దేశ వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదంటూ ఆరు నెలలక్రితం పలికిన జోస్యమూ వట్టిపోయి ఇటీవల 4.8 శాతం మేర నమోదైన అంచనాలు దిమ్మెరపరచాయి. చూడబోతే, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పరిస్థితి తేటపడి వృద్ధి జోరందుకుంటుందన్న కేంద్ర గణాంక సంస్థ ఆశావహ బాణీనే ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ బృందం పుణికి పుచ్చుకొన్నట్లు ప్రస్ఫుటమవుతోంది.

మౌలిక జాడ్యాల పీడ విరగడ అయినప్పుడే వృద్ధి చురుకందుకుంటుందనడంలో మరోమాట లేదు. ఆ వసతుల పద్దుకింద 2024-25నాటికి భారత్‌ అధమపక్షం 1.4లక్షలకోట్ల డాలర్లు (రూ.100లక్షల కోట్లు) వ్యయీకరించాల్సి ఉంటుందన్న ఆర్థిక సర్వే, పెట్టుబడుల ఉపసంహరణకు గట్టిగా ఓటేసింది. అది ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు అవసరమనడం- బడ్జెట్‌ సరళికి ముందస్తు సూచికగా ద్యోతకమవుతోంది. ప్రస్తుత ద్రవ్య నియంత్రణ విధానం ప్రకారం ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మూడు శాతానికి కట్టడి చేయాలన్నది తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం. దాన్ని అరశాతం మేర సడలించినా, పన్నుల రాబడి కుంగి కటకటలాడుతున్న సర్కారుకు అదనంగా రూ.1.13లక్షలకోట్ల మేర ఖర్చు చేయగల వెసులుబాటు లభిస్తుందన్నకథనాలువినిపిస్తున్నాయి. అటువైపు కేంద్రం మొగ్గును ఆర్థిక సర్వే ప్రతిఫలిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రాలూ తమ సంగతేమిటని గళమెత్తితే- ద్రవ్య నియంత్రణ నిబంధనావళి ఏం కావాలి?

సత్వర చర్యలకు నడుం బిగించాలి

ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని సర్వే యథార్థం వెల్లడించింది. సత్తువ కోల్పోయిన సాగు రంగానికి బాసట పేరిట అమలుపరుస్తున్న ఉచిత విద్యుత్‌, రుణమాఫీల వంటి తాయిలాలు రైతాంగం కడగండ్లను బాపడంలో విఫలమవుతుండటం నడుస్తున్న చరిత్ర. సగటు అన్నదాత దురవస్థను సర్వే చెప్పకనే చెప్పిన దరిమిలా, బడ్జెట్లో విత్తమంత్రి ఏపాటి ఔదార్యం కనబరుస్తారో ఏమో! 2011-12 లగాయతు ఏడేళ్లలో 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందని ముక్తాయించిన ఆర్థిక సర్వే, ఎగుమతులపై దృష్టిపెడితే 2030నాటికి ఎనిమిది కోట్ల ఉపాధి అవకాశాలు సాధ్యమేనంటోంది. లోగడ ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వృద్ధి’పై ఆందోళన చెందినా ఎంతమాత్రం స్పందించని సర్కారు- నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠానికి చేరి నిరుద్యోగిత హడలెత్తిస్తున్న తరుణంలో సత్వర చర్యలకు నడుం బిగించాల్సి ఉంది.

దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యలు ఆవశ్యకం

గ్రామీణ పరిశ్రమలు, విద్య, ఐటీ రంగాల్ని పరిపుష్టం చేసి సేద్యానికి జవసత్వాలు సంతరింపజేస్తే ఉపాధి అవకాశాలు ఊపందుకుంటాయి. సంపద సృష్టిని, అయిదు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థ కలను ప్రత్యేకంగా ఉటంకించిన ఆర్థిక సర్వే- ‘చైనా నమూనా’కు వత్తాసు పలకడం విశేషం. భారత్‌నుంచి ఎగుమతులకన్నా వెలుపలి దేశాలనుంచి ఇక్కడికి దిగుమతులే అధికమన్న సర్వే స్పష్టీకరణ, దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను సూచిస్తోంది. దిల్లీలో పిస్తోలు లాంటి మారణాయుధం సొంతం చేసుకోవడానికి సమర్పించాల్సిన పత్రాల సంఖ్యతో పోలిస్తే- పదిమందికి ఉపాధి కల్పించే రెస్టారెంట్‌ ప్రారంభించడానికి ఇవ్వాల్సినవి రెండింతల కన్నా ఎక్కువ. వాణిజ్య అనుకూలాంశాల సూచీలో నిరంతర పురోగతిని లక్షిస్తున్నామంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి స్థితిగతుల్లో మెరుగుదలపై దృష్టి కేంద్రీకరించడం తక్షణావసరం. ‘భారత్‌లో తయారీ’కి, సూక్ష్మ సంస్థలకు ఊతంపట్ల సహేతుకంగా స్పందించిన సర్వే- వ్యవస్థాగత పరపతి సన్నగిల్లిందనీ నిష్ఠురసత్యం పలికింది. ఆ మేరకు కంతల్ని ఎలా పూడ్చదలచారో నేటి బడ్జెటే బదులివ్వాలి!

ఆకలికి మించిన అవమానం మరొకటి లేదని, అభివృద్ధి ప్రక్రియలో పేదలు భాగస్వాములైతేనే నిజమైన పురోగతి సుసాధ్యమని రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ లోగడ చెప్పింది అక్షర సత్యం. జాతీయ తలసరి ఆదాయ సగటును అందుకోలేక కొన్ని రాష్ట్రాలు నేటికీ కిందుమీదులవుతుండగా, ‘తాలినామిక్స్‌’ పేరుతో- ప్లేటు భోజనం కొనుగోలులో సామాన్యుల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడిందన్న సర్వే సూత్రీకరణ.... క్రూర పరిహాసం. వస్తు సేవలకు ప్రజలు పెట్టే ఖర్చు తెగ్గోసుకుపోయి గిరాకీ సన్నగిల్లడం ప్రస్తుత మాంద్యానికి ఆజ్యం పోసిన అంశాల్లో ప్రధానమైందన్న వాస్తవం, సర్వే రూపకర్తలకు పరగడుపున పడిపోయినట్లుంది! గత్యంతరం లేక దొరికిన ఏదో ఒక పని చేసి రోజులీడుస్తున్న విద్యావంతుల సంఖ్య దేశంలో భారీగానే ఉందని గతంలో ‘నీతి ఆయోగ్‌’ స్వయంగా అంగీకరించింది.

ఈసారీ వైఫల్యమే

ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక సంచాలకులు ఆ మధ్య వ్యాఖ్యానించినట్లు- దేశ దేశాల్లో ఆర్థిక సామాజిక పర్యావరణపరంగా రూపాంతరీకరణ దశలో అసమానతల తీరుతెన్నుల్ని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడే సరైన విధాన రచన సాధ్యపడుతుంది. తాజా ఆర్థిక సర్వేలో ఆ పార్శ్వం కనుమరుగైంది! జనాభాలో పదిశాతం (13.6 కోట్లమంది) అత్యంత నిరుపేదలు అనునిత్యం బతుకు పోరాటం చేస్తున్న దేశం మనది. పెచ్చరిల్లుతున్న అసమానతల చిచ్చు- అన్నింటా అందరికీ సమన్యాయం, సమధర్మాలకు ఎత్తుపీట వేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కబళిస్తోంది. అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 69వ స్థానానికి పడిపోయిన భారత్‌, 189 దేశాల మానవాభివృద్ధి జాబితాలో నూట ముప్ఫయ్యో స్థానాన అలమటిస్తోంది. అపార మానవ వనరుల్ని సద్వినియోగపరచుకుంటూ సేద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో సాకల్య క్షాళనకోసం మౌలిక మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వానికి ఆర్థిక సర్వే అందించాలి. అటువంటి సమగ్ర చిత్ర రచనలో ఈసారీ వైఫల్యమే నమోదైంది!

ZCZC
PRI GEN INT
.WASHINGTON FGN10
US-TRUMP-2NDLD IMPEACHMENT
Senate rejects motion calling for new witnesses in impeachment trial, sets stage for Trump acquittal
(Eds: Adds House Speaker Nancy Pelosi's remarks)
          Washington, Feb 1 (PTI) The Republican Party-controlled US Senate on Friday narrowly rejected the opposition Democrats' motion to call new witnesses and documents for the impeachment trial against President Donald Trump.
          As a result, the Senate is expected to acquit Trump of the charges early next week. He is scheduled to deliver his third State of the Union Address on February 4. The move to invite new witnesses was defeated by 51 to 49 votes.
          In the 100-member Senate, the Republican Party has 53 seats and the Democrats 47. Two of the Republican Senators, Mitt Romney and Susan Collins, sided with the Democrats in this vote to call former White House national security advisor John Bolton and other Trump aides to testify.
          The Democrats need 67 votes to convict and remove Trump from the White House.
          "The vote represented a major victory for Senate Majority Leader Mitch McConnell and Trump, both of whom have been calling for Republicans to reject the motion and move toward ending the trial, Politico said.
          The House, wherein the Democrats enjoy a majority had impeached Trump on two counts of misuse of power and obstruction to the Congress.
          The Senate started the impeachment trial last week.
          The Radical Left, Do Nothing Democrats keep chanting fairness, when they put on the most unfair Witch Hunt in the history of the U.S. Congress. They had 17 Witnesses, we were allowed ZERO, and no lawyers. They didn't do their job, had no case. The Dems are scamming America! Trump said in a tweet moments before the voting on move to call new witnesses.
          Democrats = 17 Witnesses. Republicans = 0 Witnesses, Trump tweeted after the vote justifying the Senate vote against the move to call new witnesses.
          The vote Friday represented a major victory for Republican leadership, The Wall Street Journal said. According to the Journal, the vote on whether to convict or acquit Trump may not take place until next week, likely on Wednesday.
          There was "no need" for the Senate to re-open the investigation which the House Democratic majority chose to conclude and which the managers themselves continue to describe as overwhelming and beyond any doubt, Senate Majority Leader Senator Mitch McConnell said.
          Never in Senate history has this body paused an impeachment trial to pursue additional witnesses with unresolved questions of executive privilege that would require protracted litigation, he said.
          We have no interest in establishing such a new precedent, particularly for individuals whom the House expressly chose not to pursue," McConnell told reporters.
          We knew this was an uphill fight, said Senate Minority Leader Chuck Schumer told reporters.
          We're not in the majority; we have a president who strikes fear in the hearts of Republicans, he added.
          To not allow a witness, a document--no witnesses, no documents--in an impeachment trial is a perfidy. It's a grand tragedy, one of the worst tragedies that the Senate has ever overcome. America will remember this day, unfortunately, where the Senate did not live up to its responsibilities, where the Senate turned away from truth and went along with a sham trial, Schumer said.
          If the president is acquitted with no witnesses, no documents, the acquittal will have no value because Americans will know that this trial was not a real trial. It had no witnesses, no documents, is a tragedy on a very large scale, the Senate Minority Leader alleged.
          House Speaker Nancy Pelosi described it as a "sad day" for America.
          "The Senate Republicans' vote against calling witnesses and compelling documents in the impeachment proceedings makes them accomplices to the President's cover-up, she said.
          The President was impeached for abuse of power and obstruction of Congress. He is impeached forever. There can be no acquittal without a trial. And there is no trial without witnesses, documents and evidence, she added.
          It is a sad day for America to see Senator McConnell require the Chief Justice of the United States to preside over a vote which rejected our nation's judicial norms, precedents and institutions to uphold the Constitution and the rule of law, Pelosi said. PTI LKJ
SMN
SMN
02010637
NNNN
Last Updated : Feb 28, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.