ETV Bharat / bharat

లాక్​డౌన్​ సడలింపులతో కార్యకలాపాలు షురూ

కరోనా కట్టడిలో భాగంగా మే 4 నుంచి లాక్​డౌన్​ 3.0 అమల్లోకి వచ్చింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిబంధనలతో కూడిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సడలింపులు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనాలు బయటకు వచ్చారు. క్యాబ్​లకు అనుమతి ఉన్నందున వందకు పైగా నగరాల్లో సేవలు ప్రారంభించినట్లు ఓలా ప్రకటించింది.

author img

By

Published : May 5, 2020, 6:48 AM IST

activities start in Green zones
గ్రీన్​జోన్లలో పెద్ద ఎత్తున బయటకు వచ్చిన జనం

సడలింపులతో అమల్లోకి వచ్చిన మూడోదశ లాక్‌డౌన్‌తో సోమవారం నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో సందడి మొదలైంది. రహదారులపైకి ట్రక్కులు సహా భారీ వాహనాలు వచ్చాయి. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో క్యాబ్‌ సేవలూ మొదలయ్యాయి. వందకు పైగా నగరాల్లో క్యాబ్‌లు నడిపినట్లు ఓలా ప్రకటించింది. ఎరువుల తయారీ, మద్యం ఉత్పత్తి, ఆటోమొబైల్‌, వస్త్ర పరిశ్రమల్లో కార్యకలాపాలను గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. మార్కెట్లకు వస్తున్నవారు దూరం పాటించేలా చూడడం సవాల్‌గా మారింది.

అనివార్యమైతే సడలింపులు వెనక్కి

కట్టడి నిబంధనలు, పరిశుభ్రత, దూరం పాటించే విషయంలో ఏమాత్రం అలసత్వం కనిపించినా సడలింపులను వెనక్కి తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. సామాజిక సంచారం వల్ల వైరస్‌ విస్తరణ వ్యాప్తి ప్రమాదం ఎక్కువవుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని వీటికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కేరళలో వరసగా రెండోరోజూ కొత్త కేసులేమీ బయటపడలేదు. ఈశాన్య రాష్ట్రాలు, అనేక చిన్న రాష్ట్రాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది. తమిళనాడులో మాత్రం అమాంతం పెరిగిపోయాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటివరకు కేసులు లేని ప్రాంతాల్లో ఇప్పుడు గానీ కరోనా బయటపడినట్లయితే ఆంక్షల్ని మళ్లీ అమలు చేస్తారు. ‘‘కేసుల సంఖ్య ఎప్పటికి గరిష్ఠ స్థితికి చేరుతుందన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది. నియంత్రణ చర్యల్లో మనం విఫలమైతే కేసులు ముమ్మరంగా పెరుగుతాయి’’ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

బిహార్‌లోని 38 జిల్లాల్లో గ్రీన్‌ జోన్‌లు లేవని ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే చెప్పారు. మే-జూన్‌ మధ్య కేసుల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుతుందని కొందరు భావిస్తుండగా.. కేంద్రం మాత్రం అలాంటి పరిస్థితే రాదని చెబుతోంది.

అయోమయంతో తప్పని ఇబ్బందులు

సడలింపు చర్యల్లో భాగంగా కొన్ని జోన్లలో వస్త్ర దుకాణాలు, విద్యుత్తు సామగ్రి దుకాణాలు, మరమ్మతు షాపులు, క్షౌరశాలలు వంటివి తెరచుకున్నాయి. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడం వల్ల పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించే విషయమై దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ సహా అనేకచోట్ల అయోమయం కొనసాగింది. కొన్నిచోట్ల వీటిని తెరిచినా సిబ్బంది హాజరయ్యేందుకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రైళ్లు, బస్సులు, మెట్రోరైళ్లు నడవక అనేక నగరాల్లో తాకిడి చాలా తక్కువగానే ఉంది. దిల్లీ, బెంగళూరులలో మాత్రం వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చి కొన్నిచోట్ల జామ్‌లు తలెత్తాయి. గురుగ్రామ్‌లో నిర్మాణ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక మరణాల రేటు

దేశంలోనే అత్యంత ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లో 12.8% కొవిడ్‌-19 మరణాల రేటు ఉందని అంతర మంత్రిత్వశాఖల కేంద్ర బృందం పేర్కొంది. రాష్ట్రంలో కేత్రస్థాయి పరిశీలన ముగిసిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బృందం నేత అపూర్వ చంద్ర లేఖ రాశారు. మరోవైపు- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసు పాలన సాగిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ దన్‌ఖడ్‌ విమర్శించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి పనిచేయాల్సి ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి సాయం అందించాలంటూ సోమవారం ఆమెకు లేఖ రాశారు.

ఇదీ చూడండి:కరోనా సంక్షోభంతో సరికొత్త ట్రెండ్స్‌ రానున్నాయా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.