ETV Bharat / entertainment

'బాహుబలి 3' కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​! - RAJAMOULI BAAHUBALI 3

'బాహుబలి 3'పై మాట్లాడిన నిర్మాత కేఈ జ్ఞానవేల్‌

Rajamouli Prabhas Baahubali 3
Rajamouli Prabhas Baahubali 3 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 8:48 AM IST

Rajamouli Baahubali 3: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ప్రభాస్‌ కూడా ఈ చిత్రంతోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా వచ్చి భారీ విజయంతో పాటు కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో బాహుబలి 3కి అప్పట్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం అనంతరం ఆర్​ఆర్​ఆర్​, ఇప్పుడు SSSMB 29తో బిజీ అయిపోయారు. అయినప్పటికీ బాహుబలి 3 ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడో చెప్పలేదు.

అయితే తాజాగా మరోసారి బాహుబలి 3 చర్చ తెరపైకి వచ్చింది. కోలీవుడ్‌ నిర్మాత(ప్రస్తుతం కంగువా సినిమాకు) కేఈ జ్ఞానవేల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూడో భాగంపై ఆసక్తికర కామెంట్స్​ చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో నిర్మాతగా జ్ఞానవేలే వ్యవహరించారు.

ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్​లో(Kanguva Promotions) భాగంగా ఆయన మాట్లాడుతూ ‘గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. మూడో భాగం ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు. దాని కన్నా ముందు రెండు సినిమాలు ఉన్నాయి. అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాహుబలి - 3 కోసం వెయిటింగ్‌ అంటూ ప్రభాస్‌ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.

ఆ మధ్య రాజమౌళి ఈ బాహుబలి 3 గురించి మాట్లాడుతూ బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈ సారి చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్​తో # SSMB29 పనుల్లో బిజీగా ఉన్నారు. అమెజాన్‌ ఫారెస్ట్ నేపథ్యంలో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. సినిమాను ఇండియన్ లాంగ్వెజెస్​తో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత ఆయన బాహుబలి 3 పనులు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

'పుష్ప 2'లో యానిమల్ యాక్టర్​ - సుకుమార్ ప్లానింగ్​కు ఫ్యాన్స్ సర్​ప్రైజ్​

ప్రభాస్​ 'స్పిరిట్​'లో మరో ఇద్దరు బడా హీరోలు! - ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.