కొత్తగా ఓటు హక్కు కోసం దరాఖాస్తు చేసుకునే వారు, పాత ఓటర్ల ఆధార్ సంఖ్యలను సేకరించేందుకు చట్టబద్ధమైన మద్దతు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్...కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఓటరు జాబితాలో బోగస్ కార్డులను తనిఖీ చేసేందుకు ఆధార్ సంఖ్యలు ఉపయోగపడతాయని ఈసీ తెలిపింది.
ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేరున్న వారి ఆధార్ సంఖ్యలను పొందటానికి ఈసీకి అనుమతి ఇచ్చేలా ప్రజా ప్రాతినిథ్య చట్టంలో మార్పులు చేయాలని పేర్కొంటూ న్యాయశాఖకు లేఖ రాసింది.
ప్రస్తుత ఓటర్లు, నూతనంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్ నంబర్ల పరిశీలనకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అధికారమిస్తూ ఎన్నికల చట్టాన్ని సవరించాలని ఈసీ ప్రతిపాదించింది.
2015 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటర్ల జాబితాతో ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆధార్ సంఖ్యను సేకరించేందుకు చట్ట సవరణ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- 'బుజ్జగింపు రాజకీయాల వల్లే ముమ్మారు కొనసాగింది'