ETV Bharat / bharat

ఆ పార్టీల జాతీయ హోదా.... గల్లంతేనా? - ఎన్నికల కమిషన్​

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఎన్​సీపీ, తృణమూల్​ కాంగ్రెస్, సీపీఐలకు ఎన్నికల కమిషన్​ షోకాజ్​ నోటీసులు జారీచేసింది. వాటి జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో ఆగస్టు 5లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

జాతీయ పార్టీ హోదా... గల్లంతేనా?
author img

By

Published : Jul 19, 2019, 6:05 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన ఎన్​సీపీ, తృణమూల్​ కాంగ్రెస్, సీపీఐలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా భారత ఎన్నికల కమిషన్​ ఆయా పార్టీలకు షోకాజు నోటీసులు జారీచేసింది. వారి జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో ఆగష్టు 5లోగా వివరించాలని కోరింది.

2014 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​సీపీ 6 సీట్లు సాధించగా.... ఈసారి ఎన్నికల్లో మాత్రం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికలపడింది.

ఇదే విధంగా... 2014 ఎన్నికల్లో 34 లోక్​సభ సీట్లు సాధించి విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్... తాజా ఎన్నికల్లో కేవలం 22 సీట్లు మాత్రమే సాధించగలిగింది.

కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన సీపీఐ... తాజా ఎన్నికల్లో రెండు సీట్లు సాధించింది. కానీ పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వీటి జాతీయ పార్టీ హోదాకు ముప్పు ఏర్పడింది.

నియమాలు మారాయి..

2014 లోక్​సభ ఎన్నికల్లో ఘోరపరాజయం మూటకట్టుకున్న సీపీఐ, బీఎస్పీ, ఎన్​సీపీలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. అయితే 2016లో ఎన్నికల కమిషన్​.. నియమాలను సవరించడం వల్ల ఆయా పార్టీలకు ఉపశమనం కలిగింది. రాజకీయ పార్టీల జాతీయ హోదాను ప్రతి ఐదు సంవత్సరాలకు బదులుగా ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించాలని నిర్ణయించేందుకు నిర్ణయం తీసుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 లోక్​సభ సీట్లు, కొన్ని అసెంబ్లీ సీట్లు సాధించిన 'బహుజన్ సమాజ్ పార్టీ' (బీఎస్పీ) జాతీయ హోదాను నిలబెట్టుకోగలిగింది.

జాతీయ పార్టీ హోదా..

ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్​, కేటాయింపులు) ఉత్తర్వు, 1968 ప్రకారం... ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే...

1. లోక్​సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో... నాలుగు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి.

2. లోక్​సభలో ఆ పార్టీకి చెందిన కనీసం నలుగురు సభ్యులు ఉండాలి.

3. మొత్తం లోక్​సభ స్థానాల్లో కనీసం 2 శాతం సీట్లు పొంది ఉండాలి. అలాగే ఆ పార్టీ సభ్యులు కనీసం 3 రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి.

ప్రస్తుతం టీఎమ్​సీ, భాజపా, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్​సీపీ, నేషనల్​ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నాయి.

ఇదీ చూడండి: కర్​నాటకీయంలో ఆఖరి అంకం నేడేనా!

Amritsar (Punjab), July 18 (ANI): The month of Saawan has arrived and Amritsar's Golden Temple has also planned something special for the devotees for the holy month. Golden Temple is one of the holiest places for pilgrims. People from around the world come here to see the Gurdwara plated with sheets of gold. This month in Gurdwara, delicacies like kheerpuri and other delicious dishes are being served to devotees and needy. Devotees also are willing to help in organizing langar at the temple. The month of saawan will end in mid August.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.