తమిళనాట ఎన్నికల సంఘం, ఆదాయ పన్ను శాఖ దాడుల కలకలం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు కొద్దిగంటల ముందు మదురైలో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అన్నాడీఎంకే నేత దేవదాస్ ఇంట్లో సోదాలు జరిపింది.
కొద్దివారాలుగా తమిళనాడు, కర్ణాటకలో ఈసీ, ఐటీ శాఖల దాడులు పెరిగిపోయాయి. కేవలం ప్రతిపక్షాలపైనే మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళవారం రాత్రి డీఎంకే నేత కనిమొళి, ఈ ఉదయం ఏఎంఎంకే నేతల ఇళ్లల్లో సోదాలు చేయడం మరింత దుమారం రేపింది. ఇప్పుడు భాజపా మిత్రపక్షం అన్నాడీఎంకే నేత ఇంట్లో ఈసీ బృందం తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి: డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు