ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల కేదార్నాథ్, బద్రినాథ్ యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల చివరి దశ ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని శనివారం ఉత్తరాఖండ్‌లోని యాత్రలకు నిర్ణయించారు.
మోదీ రెండు రోజుల పర్యటనకు అనుమతించాలని ప్రధానమంత్రి కార్యాలయం ఈసీని కోరింది. ఇది కేవలం అధికారిక యాత్ర కావడం వల్లే అనుమతించినట్టు ఈసీ స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 10న విధించిన ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయాన్ని పీఎంవోకు గుర్తుచేసినట్టు ఈసీ వెల్లడించింది.
చివరి దశ లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. నేడు మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథుడి దర్శించుకుని అక్కడి నుంచి రేపు బద్రీనాథ్‌కు వెళతారు.
ఇదీ చూడండి: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మనకేంటి?