ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 21న గుజరాత్ పటన్ నగరంలో చేసిన ప్రసంగానికి ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. బాలాకోట్ దాడుల అనంతరం భారత వింగ్ కమాండర్‌ను తిరిగి రప్పించడానికి పాక్‌పై ఒత్తిడి తేవడంలో భారత ప్రభుత్వం సఫలమైందని మోదీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈసీ సచ్ఛీలత పత్రమిచ్చింది.
మోదీ చేసిన ప్రసంగంపై గుజరాత్ నుంచి నివేదికను తెప్పించుకున్న ఈసీ పరిశీలించి క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
మోదీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో మోదీపై వచ్చిన 6 ఫిర్యాదులపై ఈసీ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో సైన్యం చర్యల గురించి ప్రస్తావించరాదని మార్చి 19న ఈసీ ఆదేశాలు జారీ చేసింది.