కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, భాజపా నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఎన్నికల సంఘం మందలించింది. ఉత్తరప్రదేశ్ రాంపుర్‌లో ఈనెల 3న ఎన్నికల ప్రచారంలో నఖ్వీ భారత సైన్యాన్ని ఉద్దేశించి 'మోదీ కీ సేన' అనడంపై ఈసీ షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 'మోదీ కీ సేన' అన్నట్లు నఖ్వీ అంగీకరించారు.
ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కారాదని నఖ్వీని హెచ్చరించింది ఈసీ. భద్రతా బలగాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం నియమాలకు విరుద్ధమని మార్చి 19 నాటి సూచనలను గుర్తు చేసింది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఏప్రిల్ 5న ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై 3రోజుల ప్రచార నిషేధం విధించింది ఈసీ.
ఇదీ చూడండి: మోదీ కాన్వాయ్, హెలికాప్టర్ తనిఖీ.. ఐఏఎస్‌పై వేటు