ETV Bharat / bharat

భాజపా భోపాల్​ అభ్యర్థి సాధ్వికి ఈసీ ఝలక్​

భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్​పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించకూడదని ఆదేశించింది.

author img

By

Published : May 2, 2019, 7:35 AM IST

Updated : May 2, 2019, 7:47 AM IST

భాజపా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​కు ఈసీ ఝలక్​

భోపాల్​ నుంచి భాజపా లోక్​సభ అభ్యర్థిగా బరిలో ఉన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్​పై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 3 రోజుల (72 గంటలు) పాటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్)​ మాజీ విభాగాధిపతి​ హేమంత్​ కర్కరే, బాబ్రీ మసీదు వ్యవహారంలో సాధ్వి చేసిన ఆరోపణలపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫలితంగా ఆమెను 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా చూసుకోవాలని సూచించింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి నిషేధం వర్తిస్తుందని తెలిపింది ఎన్నికల సంఘం.

సాధ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు

మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో... మాజీ ఐపీఎస్​ అధికారి హేమంత్​ కర్కరేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సాధ్వి. అలాగే ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా మతపరమైన వ్యాఖ్యలూ చేశారు. 1992లో అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యలపై సాధ్వి వివరణ ఇచ్చినప్పటికీ ఈసీ నిషేధం విధించింది. మాలెగావ్​ బాంబు పేలుళ్ల కేసు నిందితురాలిగా జైలు జీవితం కూడా గడిపారు సాధ్వి.

ఇదీ చూడండి : మూడు మాడ్యూళ్లతో చంద్రుడిపైకి చంద్రయాన్​-2...!

Intro:Body:Conclusion:
Last Updated : May 2, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.