ETV Bharat / bharat

6 ఖాళీ రాజ్యసభ స్థానాలకు జులై 5న ఎన్నిక

రాజ్యసభలోని ఆరు ఖాళీ స్థానాల ఉప ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18న నోటిఫికేషన్​, జులై 5న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఇటీవల లోక్​సభకు ఎన్నికైన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా స్థానానికీ ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభలోని 6 ఖాళీ స్థానాలకు జులై 5న ఎన్నికలు
author img

By

Published : Jun 16, 2019, 9:16 AM IST

రాజ్యసభ ఉప ఎన్నికల తేదీపై ప్రకటన చేసింది భారత ఎన్నికల సంఘం. ఆరు ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఈ నెల 18 నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు తెలిపింది. జులై 5న ఎన్నికలు... అదే రోజున ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఈసీ. ఇందులో లోక్​సభకు ఎన్నికైన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా స్థానమూ ఉంది.

పార్లమెంట్​లోని అన్ని సభల్లో ఏర్పడిన ఖాళీలను ప్రత్యేక ఖాళీలుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది ఈసీ. వీటికి ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రత్యేక ఎన్నికలు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు 1994, 2009లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులను ఉదహరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నియమాల ప్రకారం ఒకే రాష్ట్రంలో వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ తీర్పులు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొంది.

కాంగ్రెస్​ డిమాండ్..

గుజరాత్​లో ఇటీవల ఖాళీ అయిన రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటిలో ఒక్క స్థానంలోనైనా గెలిచే అవకాశముందని భావిస్తోంది కాంగ్రెస్​. వేరు వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే భాజపాకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

బిహార్​లోని కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ స్థానం, ఒడిశాలోని అచ్యుతానంద సమంత స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటితో పాటు ఒడిశాలోని మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఇదీ చూడండి: వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Old Trafford, Manchester, England, UK. 15th June 2019
1. 00:00 Old Trafford ground showing a mobile lighting rig to dry outfield
2. 00:11 Various of mobile lighting rig
3. 00:29 Rain and halogen light falling on covers
4. 00:36 Pitch under cover
5. 00:48 Hover cover
6. 00:54 Technicians covering Spider camera
7. 01:05 Rain on covers
8. 01:10 Various of Members stand
9. 01:22 Mickey Arthur and a support staff at Indoor nets
10. 01:34 Various of Shoaib Malik
11. 01:53 Shadab Khan
12. 02:00 Mohammed Amir talking to Imad Wasim
13. 02:12 Imad Wasim batting
SOURCE: SNTV
DURATION: 02:18
STORYLINE:
Rain has already wreaked havoc at the ICC Cricket World Cup 2019 and on Saturday the weather forced Pakistan to train indoors ahead of their big match against arch-rivals India at Old Trafford in Manchester.
With criticism mounting on the scheduling of the tournament, the authorities were seen doing their best to get the ground prepared for possibly the most-watched match of this World Cup.
A mobile lighting rig, which emanates halogen light, was seen being used to dry up the outfield.
The pitch and the square, however, were under covers as rain continued to fall in Manchester. The weather is expected to intervene on Sunday with a truncated match the most likely outcome.
Pressure is building on Pakistan - they need to get their campaign back on track after suffering their second defeat of the tournament in their previous match.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.