'మే బీ చౌకీదార్' ప్రచారానికి సంబంధించిన చిత్రాలనురైల్వేశాఖ టికెట్లు, టీ కప్పులపై ముద్రించడాన్ని తప్పుపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందికి వస్తుందా... లేదా అనే అంశమై రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. గురువారంలోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శతాబ్ది ఎక్స్ప్రెస్కు చెందిన టికెట్లను ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వాటిపై మై బీచౌకీదార్ నినాదం ఉండటం వివాదానికి కారణమైంది.
వివాదాస్పద కప్పులను వెనక్కి పంపిస్తామని, గుత్తేదారుపై చర్య తీసుకుంటామని రైల్వేశాఖ ప్రకటించింది. రైల్వే టికెట్లపై మోదీ చిత్రాలను ముద్రించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది.
"సంకల్ప్ అనే ఎన్జీఓ సంస్థ రైల్వేకు సంబంధించిన టీ కప్పులను తయారు చేస్తోంది. ఈ కప్పులపై భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన నినాదాలు ఉన్నాయి. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది."-ఎన్నికల సంఘం
సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. ఈ విషయమై రైల్వేశాఖ ఇంకా స్పందించలేదు.