ETV Bharat / bharat

కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే! - ఇండియా కరోనా వైరస్​

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్యకు ఆంక్షల సడలింపు, వలసదారుల ప్రయాణాలే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పరీక్షలు విస్తృతంగా జరుగుతుండటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

Easing of travel restrictions, movement of migrants behind surge in COVID-19 cases: experts
దేశంలో పెరుగుతున్న కేసులకు కారణం అవే!
author img

By

Published : May 26, 2020, 5:34 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కేసుల సంఖ్యలో టాప్​-10లోకి చేరింది భారత్. కొన్ని రోజులుగా ప్రతిరోజు 6 వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. పరీక్షలను విస్తృతం చేయడం సహా ప్రయాణాలపై ఆంక్షలను సడలించడం, వలసదారులు ఇళ్లకు చేరడం వంటివి ప్రస్తుత పరిస్థితికి కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎయిమ్స్​ డైరక్టర్​ రణ్​దీప్​ గులేరియా తెలిపిన వివరాల ప్రకారం... కేసుల పెరుగుదల ప్రధానంగా హాట్​స్పాట్​ కేంద్రాల్లోనే జరుగుతోంది. అయితే ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలించడం వల్ల రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎలాంటి లక్షణాలు బయటపడని వైరస్​ బాధితులకు.. స్క్రీనింగ్​ పరీక్షలు చేసినా లాభం లేదన్నారు రణ్​దీప్​. వీరందరూ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళితే అక్కడా బాధితుల సంఖ్య పెరుగుతుందన్నారు.

వైరస్​ వ్యాప్తిని నియంత్రించడానికి వలసదారులు తిరిగివెళ్లిన ప్రాంతాల్లో మరింత నిఘా పెట్టాలని సూచించారు ఎయిమ్స్​ డైరక్టర్​. చేతులు శుభ్రం చేసుకోకుండా, సరైన భౌతిక దూరం నియమాలను పాటించకుండా ప్రజలు రోడ్లపైకి వస్తే.. వైరస్​ విజృంభణ మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు.

వీటన్నిటితో పాటు కరోనా పరీక్షలు విస్తృతంగా జరుగుతుండటం.. కేసుల పెరుగుదలకు కారణమవుతోందని గులేరియా వెల్లడించారు.

రైలు, రోడ్డు రవాణా సేవలకు అనుమతులిస్తే.. కరోనా వైరస్​ ఓ కార్చిచ్చులా విజృంభిస్తుందని ఇండియన్​ పబ్లిక్​ హెల్త్​ అసోసియేషన్​ మాజీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్​ ఎస్​ పాండే అభిప్రాయపడ్డారు.

"రైలు, రోడ్డు రవాణా సేవలు పాక్షికంగా మొదలయ్యాయి. వలసదారులు తమ సొంతగూటికి చేరుతున్నారు. దీంతో వైరస్​ విజృంభణకు గేట్లు తెరుచుకున్నట్లు అయింది. వైరస్​ ఓ కార్చిచ్చులా వ్యాప్తి చెందడానికి మనమే వాతావరణాన్ని సృష్టించాము. ఫలితంగా రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. లాక్​డౌన్​ను ఎప్పటికీ ఉంచలేము. అది నిజమే. కానీ ఆంక్షల సడలింపు పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రయాణాల వల్ల వైరస్ మరింత తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్​ను నియంత్రించడానికి ఇక ప్రభుత్వం బలమైన నిఘాను ఏర్పాటు చేయాలి. అయితే అది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి."

--- డా. చంద్రకాంత్​ పాండే, ఐపీహెచ్​ఓ మాజీ అధ్యక్షుడు.

ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా వలసదారులు ప్రయాణం సాగిస్తే.. రానున్న రోజుల్లో వైరస్​ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందని కాన్ఫెడరేషన్​ ఆఫ్​ మెడికల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఆసియా అండ్​ ఓషనిక్ ​(సీఎమ్​ఓ) అధ్యక్షుడు డా. కే కే అగర్వాల్​ అన్నారు. మూడో లాక్​డౌన్​లో కేసులు భారీగా పెరిగి.. నాలుగో దశలోనూ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయంటే.. ప్రజలు భౌతిక దూరాన్ని సరిగ్గా పాటించడంలేదని అర్థమన్నారు.

అయితే దేశంలో నమోదవుతున్న కేసులకు.. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, వైరస్​ వ్యాప్తి పెరగడం కారణమని పబ్లిక్​ హెల్త్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా అధ్యక్షుడు ఫ్రొఫెసర్​ కే శ్రీనాథ్​​ రెడ్డి పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,45,380 కేసులు నమోదయయ్యాయి. 4,167మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

మంగళవారం ఉదయం 9 గంటల వరకు దేశవ్యాప్తంగా 31,26,119 నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో 92,528 మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి:- మరో 20 మంది సీఐఎస్​ఎఫ్ సిబ్బందికి కరోనా! ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.