జమ్ముకశ్మీర్ లేహ్ జిల్లాలోని అల్చిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతగా నమోదైంది. మధ్యాహ్నం 2.30 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. గడిచిన ఏడురోజుల్లో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించడం ఇది నాలుగోసారి.
లద్దాఖ్‌లో గడిచిన శుక్రవారం కూడా 5.4, 3.6 మధ్యస్థాయి తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించింది. ఈ విధంగా తరుచూ భూకంపాలు రావడం వల్ల ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: వచ్చే వారం జపాన్‌లో జైశంకర్ పర్యటన