ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఈ తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. భారత్- మయన్మార్ సరిహద్దులోని ఛాంపియా జిల్లాలోని జొకావతర్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. మిజోరంలో 12 గంటల్లో ఇది రెండో భూకంపం.
భూకంపం ధాటికి మిజోరం రాజధాని ఐజ్వాల్ సహా పలు జిల్లాల్లో ఇళ్లు, భవనాలు కొన్నిచోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారితోపాటు చాలాచోట్ల రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని.. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మోదీ అభయం...
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. మిజోరం సీఎం జోరంతంగాతో మాట్లాడారు. కేంద్ర తరఫున అన్నివిధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మిజోరం సీఎంతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. కేంద్రం అవసరమైన సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు
ఇదీ చదవండి: పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి