అరావళీ పర్వత శ్రేణులు.. దేశంలో అతిపురాతనమైనవి. ఈ పరిసర ప్రాంతాల్లో పాలరాయి అధికంగా లభిస్తుంది. పాలరాయిని తొలిచిన వ్యర్థాలు పడేయటం వల్ల ఈ పర్వతాలు కళను కోల్పోయాయి. ఫలితంగా అక్కడి నేలలు తెల్ల రంగు పులుముకుని బంజరు భూములుగా మారాయి.
రాజస్థాన్లోని ఉదయ్గఢ్ జిల్లా అధికారులు ఆ పర్వతాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాలరాయి ఉత్పత్తిదారుల సహకారంతో మళ్లీ పచ్చదనం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మొక్కలను నాటి వాటిని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
మిగతా జిల్లాలు ఇలా..
పాలరాయి వ్యర్థాల సమస్య రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉంది. అయితే ఉదయ్గఢ్లోనే పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇతర జిల్లాల్లోనూ ఈ తరహా చర్యలు తీసుకోవాలని పర్యవరణ ప్రేమికులు కోరుతున్నారు.
బుధవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా జీవం కోల్పోయిన నేలలకు పునర్జన్మ ఇస్తున్న అధికారుల ప్రయత్నం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం