హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని కిన్నౌర్ జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌లో పొగలు వచ్చాయన్న సమాచారం కలకలం రేపింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు చూసిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటల నుంచి ఈవీఎంలను రక్షించేందుకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచారు. తీరా చూస్తే అక్కడే ప్రమాదమూ జరగలేదు. గదిలో ఎలాంటి పొగలూ వ్యాపించలేదు.
అంతా కెమెరా మాయ...
స్ట్రాంగ్‌రూమ్‌లో పొగలు వచ్చినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించడానికి కారణాలు కనుగొన్నారు అధికారులు. సీసీ కెమెరాలు నైట్మోడ్లో ఉన్నాయి. గదిలోని ఓ మూల ధూళి కణాలు ఎగసి పడ్డాయి. ఫలితంగా... అగ్ని ప్రమాదం జరిగిందని ఊహించారు అధికారులు. చివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధరించుకుని, ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సీసీ కెమెరాలు మార్చారు. స్ట్రాంగ్‌రూమ్‌కు మరోసారి సీల్ వేశారు.
ఇదీ చూడండి : మంత్రిపై వేటు- మరో పార్టీతో భాజపా కటీఫ్!