కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురుని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్టు చేసింది. వారి నుంచి 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది.
"కరీపుర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కొచ్చి, కోజికోడ్‌కు చెందిన డీఆర్ఐ అధికారులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో నిందితులు వేగంగా దూసుకెళ్లగా ఇద్దరు అధికారులు, ఓ డ్రైవర్ గాయపడ్డారు. అయినప్పటికీ నిందితులను అధికారులు పట్టుకుని వారి నుంచి 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు."
- సీబీఐసీ
గాయపడిన డీఆర్ఐ అధికారుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీశారు. వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించాలని సీబీఐసీని ఆదేశించారు.
ఇదీ చూడండి: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన దుండగులు