ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్​, టీ షర్ట్​​ ధరించొద్దు! - మహారాష్ట్ర ఉద్యోగులకు డ్రెస్​ కోడ్

పోలీస్ సహా కొన్ని శాఖలు మినహా.. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నచ్చిన దుస్తులు ధరించి ఆఫీసుకు వస్తుంటారు. ఇలాంటి నచ్చిన బట్టలు వేసుకునే అవకాశం మహారాష్ట్ర ఉద్యోగులకు ఇకపై ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రత్యేక డ్రెస్​ కోడ్​ను తీసుకొచ్చింది ఉద్ధవ్​ సర్కార్.

Dress code for govt employees in Maharashtra
మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్​ కోడ్
author img

By

Published : Dec 11, 2020, 8:45 PM IST

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్​ ధరించి ఆఫీసులకు రావడం ఇప్పుడు సర్వ సాధారణం. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇకపై ఆ ఛాన్స్ లేదు. ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్​ కోడ్​ ప్రవేశ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు ఈ నెల 8న డ్రెస్​ కోడ్ నిబంధనలను తెలుపుతూ ఓ సర్కులర్ జారీ చేసింది ప్రభుత్వం.

డ్రెస్​కోడ్ ఇలా..

  • మహిళా ఉద్యోగులు చీరలు, చుడీదార్​లు, కుర్తాలు, ట్రౌజర్​ ప్యాంట్లు ధరించాలి. షర్ట్​లు ధరించేందుకు వీలుంది అయితే వాటిపై అవసరమైతే దుపట్టాలు వేసుకోవాలి.
  • పురుష ఉద్యోగులకు మాత్రం తక్కువ అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. వారు ట్రౌజర్​ ప్యాంట్లు, షర్ట్​లు మాత్రమే వేసుకోవాలి.
  • ముదురు రంగు దుస్తులు, ఎక్కువగా డిజైన్ ప్యాట్రన్లు, బొమ్మలు ఉన్న దుస్తులు ధరించకూడదు. జీన్స్, టీ షర్ట్​లు వేసుకునేందుకు అనుమతి లేదు.
  • మహిళలు చప్పల్, సాండల్స్, షూ వేసుకోవచ్చు. పురుషులు షూ లేదా సాండల్స్ మాత్రమే వేసుకోవాలి. స్లిప్పర్లు ధరించేందుకు అవకాశమే లేదు.
  • చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు.. శుక్రవారం ఒక్క రోజైనా ఖాదీ దుస్తులు ధరించాలి.

డ్రెస్​ కోడ్ ఎందుకు?

అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు (ముఖ్యంగా కాంట్రాక్ట్​ సిబ్బంది) సరైన దుస్తులు ధరించడం లేదని గమనించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణంగా ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం తగ్గుతోందని గమనించినట్లు ప్రకటనలో తెలిపింది. ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంచి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని ఆశిస్తారని గుర్తు చేసింది.

ఇదీ చూడండి:ఛత్తీస్​గఢ్​ సీఎం పీఠం వీడనున్న బఘేల్?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.