ETV Bharat / bharat

'రూ. 80వేల కోట్ల లెక్కలను మేము ఒప్పుకోము' - వ్యాక్సిన్​ పంపిణీకి రూ. 80వేల కోట్లు

కరోనా వ్యాక్సిన్​ను కొనుగోలు చేసి, పంపిణీ చేసేందుకు కేంద్రం రూ. 80వేల కోట్లను ఖర్చు చేయగలదా? అన్న సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పునావాలా ప్రశ్నపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఆ లెక్కలతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్​ పంపిణీకి ఎంత ఖర్చు చేయాలన్న లేక్కలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయని పేర్కొంది.

Don't agree with calculation of Rs 80k cr for COVID vaccine distribution in India: Health Ministry
'రూ. 80వేల కోట్ల లెక్కలను మేము ఒప్పుకోము'
author img

By

Published : Sep 30, 2020, 5:40 AM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి రూ. 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్న లెక్కలతో తాము ఏకీభవించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఆరోగ్యశాఖ.

కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి.. వచ్చే సంవత్సర కాలంలో కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చు చేయగలదా?అని ఇటీవలే ప్రశ్నించారు అదర్​ పునావాలా. దీనిపై స్పందించారు కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.

"ఈ లెక్కలతో మేము ఏకీభవించడం లేదు. వ్యాక్సిన్​ నిపుణులతో ఇప్పటికే ఓ జాతీయ స్థాయిలో కమిటీని వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఇప్పటివరకు ఐదుసార్లు సమావేశమైంది. జనాభాకు సరిపడా వ్యాక్సిన్​ పంపిణీకి కావాల్సిన సొమ్ములపై ఈ కమిటీ అనేకమార్లు చర్చించింది."

--- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.

అయితే దేశ జనాభాకు వ్యాక్సిన్​ను పంపిణీ చేయడానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందనే విషయంపై ప్రభుత్వం వద్ద సమాధానం ఉందన్నారు రాజేశ్​. కానీ ఆ వివరాలను ఆయన వెల్లడించలేదు.

ఇదీ చూడండి:- 'పేద దేశాల కోసం 10 కోట్ల కరోనా టీకా డోసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.