అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన షెడ్యూల్లో భాగంగా మోటేరా స్టేడియం ప్రారంభోత్సవానికి అహ్మదాబాద్ వెళ్లనునున్నారు. అయితే అయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు మునుపెన్నడూ లేని విధంగా 22 కిలోమీటర్ల భారీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధికారులు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు
" ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మాణం ఇక్కడ జరిగింది. దాని ప్రారంభోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు భారీ రోడ్ షోను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ర్యాలీలో పాల్గొనేందుకు ధార్మిక సంస్థలను ఆహ్వానించాం. దాదాపు 300 సంస్థలకు పైగా ఈ రోడ్ షోలో పాల్గొంటున్నాయి. దాదాపు 22 కిలో మీటర్ల భారీ రోడ్ షోకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. "
-బిజల్ పటేల్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్