ETV Bharat / bharat

డాలర్​ డ్రీమ్స్​కు తప్పని కరోనా గండం!

author img

By

Published : Apr 3, 2020, 8:52 AM IST

అమెరికాలో ఉద్యోగం.. ఎంతో మంది విద్యార్థులకు జీవితకాల స్వప్నం. చదువుకునే రోజుల నుంచే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే కరోనా ప్రభావంతో ఈ సారి వారి ఆశలకు గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. 2021కి గానూ హెచ్‌1బీలో చాలా మంది భారత నిపుణులు ఎంపికైనా.. సదరు కంపెనీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఉద్యోగాలు ఇస్తాయా? అనే సందేహాలు నెలకొన్నాయి.

dollar dreams destroyed by corona virus
చెదురుతున్న అమెరికా స్వప్నం

స్వదేశంలో బీటెక్‌ అమెరికాలో ఎంఎస్‌...ఆ తర్వాత మూడేళ్లపాటు ఓపీటీ... శిక్షణలో ఉండగానే హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు. మూడేళ్లపాటు హెచ్‌1బీ వస్తే...మరోమారు మూడేళ్లు పొడిగింపు. అదే సమయంలో పనిచేసే కంపెనీ ఆమోదంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడం.... అది పెండింగ్‌లో ఉన్నంత కాలం హెచ్‌1బీ వీసా గడువును పొడిగించుకుంటూ ఉండటం... ప్రస్తుతం అమెరికాలోని భారతీయ ఉద్యోగులు పాటించే వరుస ఇదే. అమెరికాలో 2021 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ వీసా కింద ఎవరు ఎంపికయ్యారో అమెరికా పౌరసత్వం, విదేశీ సేవల విభాగం(యూఎస్‌ఐసీఎస్‌) తాజాగా వెల్లడించింది. అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు ఎంపికైనా కరోనా వైరస్‌ వారిలో ఆ ఆనందం లేకుండా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా కంపెనీలు తమకు కొలువులు ఇస్తాయో?లేదో? అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

ఈసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు

హెచ్‌1బీ వీసా కోసం ఏటేటా దరఖాస్తుల సంఖ్య(రిజిస్ట్రేషన్లు) పెరుగుతోంది. గత ఏడాది కంటే ఈసారి 74 వేల మంది అధికంగా పోటీపడ్డారు. మొత్తం 2.75 లక్షల దరఖాస్తులు అందటం గమనార్హం. ఈ మొత్తంలో 68 శాతం దరఖాస్తులు భారతీయుల నుంచి రాగా...మరో 13 శాతం చైనా వారి నుంచి అందాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హెచ్‌1బీ వీసా కోసం ఈ-రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆయా కంపెనీల(ఎంప్లాయర్‌) నుంచి యూఎస్‌ఐసీఎస్‌ దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 85 వేల వీసాల్లో మొదట అందిన మొత్తం దరఖాస్తుల నుంచి జనరల్‌ కోటా కింద 65 వేల మందిని ఎంపిక చేశారు. తర్వాత ఎంపిక కాని దరఖాస్తుల్లో అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారి దరఖాస్తుల నుంచి మాస్టర్స్‌ కోటా కింద 20 వేల మందిని ఎంపిక చేశారు. ప్రతి ఏటా 70 శాతం వరకు ఈ వీసాలు భారతీయులకే దక్కుతున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లాటరీలో కొత్త విధానం వల్ల భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికైనట్లు అంచనా వేస్తున్నారు.

జూన్‌ వరకూ గడువు

దరఖాస్తు చేసినప్పుడు కరోనా ఉద్ధృతి లేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోవడం వల్ల జూన్‌ 30వ తేదీలోపు ఆయా కంపెనీలు పూర్తి స్థాయి దరఖాస్తు(పిటీషన్‌) సమర్పిస్తాయా?లేదా? అన్న సందిగ్ధత ఉందని దేశీఓపీటీ సహ వ్యవస్థాపకురాలు జ్యోతి తెలిపారు. ‘కంపెనీ పిటిషన్‌ దాఖలు చేస్తే దాదాపు హెచ్‌1బీ వచ్చినట్లే. పిటిషన్‌ వేసేందుకు జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉంది. అప్పటి వరకు ఆందోళన తప్పదు. వీసా దక్కిన తర్వాత ఆ కంపెనీ చేర్చుకోకపోయినా రెండు నెలల లోపు ఏదో ఒక కన్సల్టెన్సీలో చేరవచ్చు’ అని ఓపీటీపై పనిచేస్తూ హెచ్‌1బీ వీసాకి ఎంపికైన విద్యార్థి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి:ఓర్పుగా.. పిల్లల గుండె చప్పుడు వినండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.