రాజస్థాన్లోని ఉదయ్పుర్లో ఓ వ్యక్తి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు. మొదట సాధారణ సమస్యగా భావించిన వైద్యులు అతనికి అల్సర్ లేక కలుషిత ఆహారం తిని కడుపునొప్పి వచ్చి ఉంటుందని అనుకున్నారు. తీరా ఎక్స్-రే చేసి చూస్తే అతడి పొట్టలో లోహపు వస్తువులున్నాయని గుర్తించి ఆశ్చర్యపోయారు.
నలుగురు డాక్టర్లు గంటన్నర పాటు ఆపరేషన్ నిర్వహించి రోగి పొట్టలోని 80 లోహ వస్తువులను బయటకు తీశారు. వీటిలో మేకులు, తాళంచెవులు, నాణేలు ఉన్నాయి. వాటి బరువు 800గ్రాములు. ఈ వ్యక్తికి మతిస్తిమితం లేదని వైద్యులు తెలిపారు. లోహపు వస్తువులు తినడం అతడికి వ్యసనమని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
గత నెలలోనూ ఇదే తరహా సంఘటన రాజస్థాన్లోనే జరిగింది. 40ఏళ్ల వ్యక్తి పొట్టలోంచి 116 మేకులు బయటికి తీశారు వైద్యులు.
ఇదీ చూడండి: 115 మేకులు మింగిన 'ఉక్కు మనిషి'