ETV Bharat / bharat

కరోనాను అడ్డుకోవాలంటే.. ఆ పని 'చేయి'కు! - hand touch

కరోనా మహమ్మారి కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని.. వైరస్​ను అడ్డుకునేందుకు చేతితో తరుచూ ముఖాన్ని తాకడం మానుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. చేతితో ముఖాన్ని తాకడం మానుకోవడం ఎలా? తెలుసుకుందాం.

corona
కరోనాను అడ్డుకోవాలంటే.. ఆ పని 'చేయి'కు!
author img

By

Published : Mar 29, 2020, 6:25 AM IST

Updated : Mar 29, 2020, 9:12 AM IST

చేతితో తరచూ ముఖాన్ని తాకడం మనందరికీ అలవాటు. దీనివల్ల కలిగే నష్టాలేమిటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించిన వేళ విస్పష్టంగా తెలిసొస్తోంది. కరోనా వైరస్‌ కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేన్నయినా మనం చేత్తో ముట్టుకున్నప్పుడు దాన్నుంచి వైరస్‌ అంటుకుంటే .. ఆ చేతి వేళ్లతో మన కళ్లు, ముక్కు, నోటిని తాకినపుడు వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం ఎంతైనా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

తరచూ ముఖాన్ని తాకొద్దు

సగటున మనం ముఖాన్ని చేత్తో ఎన్నిసార్లు ముట్టుకుంటామో తెలుసా? దీనిపై పెద్ద అధ్యయనాలే జరిగాయి. గంటకు 20 సార్లకుపైగా ముఖాన్ని తాకుతామని ఆ అధ్యయనాల్లో తేలింది. ఇందులో దాదాపు సగం సార్లు(44%) నేరుగా మన చేతులు కళ్లు, ముక్కు, నోటిని తాకుతాయి.

ఎందుకు ముట్టుకుంటాం..

ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం గోళ్లు కొరకడం, మీసాలు మెలేయడం, ముక్కులో వేలుపెట్టుకోవడం, కళ్లు రుద్దుకోవడం, జుట్టు సవరించుకోవడం లాంటివి చేస్తుంటాం. దీనివల్ల ఒత్తిడి, అసౌకర్యం తగ్గుతాయని భావిస్తుంటాం. ముఖాన్ని చేత్తో తాకే అలవాటు యుక్త వయసులోనే మొదలవుతుంది.

ఎలా తగ్గించుకోవచ్చు?

ముఖాన్ని చేతితో తాకే అలవాటును తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

  • ముఖాన్ని ముట్టుకోవద్దన్న నియంత్రణ పాటించడం ఎంతైనా అవసరం.
  • చేతులతో ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండాలి. మరీ నియంత్రించుకోలేనపుడు ఒత్తిడిని నివారించే బంతిని నొక్కడం, ముంజేతికి రబ్బరు బ్యాండు ధరించి దాన్ని లాగుతూ ఉండడం లాంటివి చేయొచ్చు. కూర్చున్నప్పుడు వీలైతే ముఖాన్ని కాకుండా కాలిని తాకే అలవాటు చేసుకోవాలి.
  • వైరస్‌లు అంటుకునే ప్రమాదం ఉన్న సెల్‌ఫోన్లు, కారు తాళాలు, తలుపులు, లిఫ్ట్‌లు.. ఇలాంటి వాటిని చేత్తో ముట్టుకుని.. అదే చేత్తో ముఖాన్ని తాకితే ముక్కు, నోరు, కళ్ల ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని తాకినపుడు చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 30వేలు దాటిన మరణాలు

Last Updated : Mar 29, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.