డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, పార్టీ యువత విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నాగపట్టణం జిల్లా తిరుక్కువళైలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు.
![Udhayanidhi Stalin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20201120-wa0053_2011newsroom_1605885638_788.jpg)
పోలీసుల చర్యలను డీఎంకే కార్యకర్తలు ఖండిస్తూ నిరసన తెలిపారు. ప్రచారాన్ని తిరిగి శనివారం ప్రారంభిస్తామని ఉదయనిధి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు.
![Udhayanidhi Stalin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20201120-wa0051_2011newsroom_1605885638_1017.jpg)
ఇదీ చూడండి: ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు