కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు గురువారం భాజపాలో చేరనున్నట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్నారాయణ్ తెలిపారు. అనర్హత నిర్ణయాన్ని సమర్థిస్తూ, అదే సమయంలో ఆ 17 మంది ఉపఎన్నికల్లో పోటీచేయొచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే ఈ ప్రకటన చేశారు నారాయణ్.
గురువారం ఉదయం 10న్నర గంటలకు బెంగళూరులో ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ సమక్షంలో అనర్హత ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు నారాయణ్.
"అనర్హత ఎమ్మేల్యేలు భాజపాలో చేరటానికి మొగ్గు చూపారు. మా పార్టీ సీనియర్ నాయకులను వారు కలిశారు. వారు మా పార్టీలోకి ఆహ్వానించారు. ఉపఎన్నికల్లో వారు పోటీచేయడం గురించి మేము తర్వాత ప్రకటన చేస్తాం."
-అశ్వత్నారాయణ్, ఉపముఖ్యమంత్రి
ఇదీ చూడండి : చావులోనూ తోడుగా.. భర్త చనిపోయిన రోజే భార్య మృతి