ETV Bharat / bharat

'సమష్టి కృషితోనే సమ్మిళిత అభివృద్ధి' - ఇండో జపాన్​ సంవాద్​

ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ.. 6వ ఇండో-జపాన్​ సంవాద్​ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో.. అంతర్జాతీయ వృద్ధిపై ప్రసంగించారు. వృద్ధి సాధించాలంటే చర్చల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగాలన్నారు. వృద్ధి మానవ కేంద్రంగా సాగాలని, అజెండా కూడా విస్తృతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Discussions on global growth cannot happen among few, table must be bigger: PM Modi
'అంతర్జాతీయ వృద్ధి సాధించాలంటే ఇది సరిపోదు'
author img

By

Published : Dec 21, 2020, 11:23 AM IST

అతికొద్ది మందితో అంతర్జాతీయ వృద్ధి సాధించలేమని.. ఈ విషయంపై చర్చించేందుకు ఎక్కువ దేశాలు కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకోసం అజెండా కూడా విస్తృతంగా ఉండాలని పేర్కొన్నారు. వృద్ధి విధానం మానవ కేంద్రంగా సాగాలని అభిప్రాయపడ్డారు.

'6వ ఇండో-జపాన్​ సంవాద్​' కాన్ఫరెన్స్​లో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని.

"సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధాల వరకు.. ఆయుధాల పోటీ నుంచి అంతరిక్ష పోటీ వరకు.. ఇతరులను కిందకు లాగే విధంగానే మన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాలి. అందరూ కలిసి పైకి ఎదుగుదాం. అంతర్జాతీయ వృద్ధిపై చర్చ కొద్దిమంది మధ్యే ఉండకూడదు. ఇందులో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. అజెండా కూడా విస్తృతంగా ఉండాలి. మానవ కేంద్రంగా వృద్ధి విధానం ఉండాలి. ఇరుగుపొరుగువారితో అందరం సామరస్యంతో మెలగాలి."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి:- సాగు చట్టాల రద్దు కోసం రైతుల నిరాహార దీక్ష

మానవతావాదాన్ని దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు మోదీ.

బుద్ధుడిపై గ్రంథాలయం..

ఇదే వేదికపై... బుద్ధుడి సాహిత్యం, రచనలతో కూడిన ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ప్రధాని. ఇందుకు భారత్​ సిద్ధంగా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి సంబంధిత పుస్తకాలను సేకరించి.. వాటిని అనువాదం కూడా చేయడానికి భారత్​ సుముఖంగా ఉన్నట్టు పేర్కొన్నారు. బౌద్ధ సన్యాసులు, పండితులకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- కరోనా వైరస్ స్ట్రెయిన్​పై అత్యవసర భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.