కొబ్బరికాయలకు అందమైన ఆకృతులను రూపొందిస్తూ వినూత్న కళాకారుడిగా గుర్తింపుపొందాడు కర్ణాటకకు చెందిన జగదీష భవికిట్టి. వాటితో విచిత్ర కళాఖండాల్ని రూపొందిస్తున్న అతడికి.. ఇటీవలే గౌరవ డాక్టరేట్ లభించింది.
ధార్వాడ్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న జగదీష.. కొబ్బరికాయలతో వినూత్న ఆకృతులను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ కళపై మోజుతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. అతడి చేతికి కొబ్బరికాయ దొరికిందంటే చాలు.. అందమైన ఆకృతిని తీర్చిదిద్దుతాడు. ఇలా తనకిష్టమైన కళలో పదేళ్లుగా సాధన చేస్తూ అందులో మరింత మెరుగయ్యాడు.
జగదీషలోని వినూత్న కళను గుర్తించిన చెన్నై విశ్వవిద్యాలయం భారతీయ విద్యాభవన్.. అతడిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
ఇదీ చదవండి: నవ్యాలోచనతో ప్రవేశ పరీక్ష లేకుండా చేయలేమా?