ETV Bharat / bharat

దిల్లీ హింసతో రైతు ఉద్యమంలో చీలిక!

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత రైతుల ఉద్యమంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు కర్షక సంఘాలు.. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

Deviation in farmer protest against in news farm laws
దిల్లీ ఘటనలతో రైతు ఉద్యమంలో చీలిక!
author img

By

Published : Jan 27, 2021, 5:39 PM IST

Updated : Jan 27, 2021, 7:07 PM IST

జనవరి 26న దిల్లీలో జరిగిన ట్రాక్టర్​ ర్యాలీ అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రీయ మజ్దూర్​ సంఘటన్.. ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్​ వీఎం సింగ్​ ప్రకటించారు.​ దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు సింగ్​ పేర్కొన్నారు. అందుకే ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు.

వేరొకరి మార్గంలో ఈ ఆందోళనను ముందుకు కొనసాగించలేమన్నారు సింగ్​. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరేలా ఉన్నప్పుడు తాము ఉద్యమం కొనసాగించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నేతలు మంగళవారం ర్యాలీని ముందుగానే ప్రారంభించడం సరికాదన్నారు.

"రాకేశ్​ తికాయత్ లాంటి నేతలు సమయానికంటే ముందు బారికేడ్లు తోసుకుని రావడం వల్లే ఉద్రిక్తత నెలకొంది. నిర్దేశిత మార్గాల్లో కాకుండా ర్యాలీని వేరే మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించాం? ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలం. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆందోళన నుంచి తప్పుకుంటున్నా. మద్దతు ధర కోసం ఆందోళన కొనసాగుతుంది. కానీ ఈ మార్గంలో ఆందోళన చేయాలని ఇక్కడికి రాలేదు. రైతులు దెబ్బలు తినడానికో, చనిపోవడానికో రాలేదు. రైతుల హక్కులు సాధించుకోవడానికి వచ్చాం."

- వీఎం సింగ్, అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్

రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్​​ (ఆర్​కేఎంఎస్​)​ ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించిందని.. ఇది ఆర్​కేఎంఎస్​ నిర్ణయం అని.. ఏఐకేఎస్​సీసీ కాదని స్పష్టం చేశారు సింగ్. హింసాయుత ఘటనలకు కారణమైన నేరస్థులకు కఠినమైన శిక్ష పడుతుందన్నారు.

మరో సంఘం..

భారతీయ కిసాన్ యూనియన్​లోని భాను వర్గం ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది. 58 రోజులుగా చిల్లా సరిహద్దులో ఆందోళన చేస్తున్న భాను వర్గం.. మంగళవారం ఘటన తీవ్రంగా బాధించిందని పేర్కొంది.

"మంగళవారం జరిగిన ఘటనలు తీవ్రంగా బాధించాయి. చిల్లా సరిహద్దులో మా ఆందోళనను ముగిస్తున్నాం."

- భాను ప్రతాప్ సింగ్, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు

Last Updated : Jan 27, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.